కోహ్లీ పిలుపు: నవ్వు తెప్పించిన క్రిస్ గేల్ పరుగు (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మైదానంలో వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరిగెత్తే జోడీల్లో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని జోడీ ఒకటి. మ్యాచ్ ఎంత ఉత్కంఠగా ఉన్న ప్రత్యర్ధి జట్టు ఫీల్డర్లపై ఒత్తిడి పెంచుతూ ఒక పరుగు వచ్చే చోట రెండు పరుగులు రాబట్టడంలో ఈ జోడీని మించిన జోడీ లేదు. [స్కోరు కార్డు]

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా, ధోని రైజింగ్ పూణె సూపర్ జెయంట్కు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దీంతో ఐపీఎల్‌లో బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీని అర్ధం చేసుకుని పరిగెత్తే ఆటగాడే కరువయ్యాడు.

ఏబీ డివిలియర్స్‌కి వేగంగా స్పందించే గుణమున్నా పరుగు సమయంలో అతడికి తడబాటు ఎక్కువేనని గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రనౌట్ అయ్యాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తాజాగా ముగిసిన మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌ని రెండో పరుగు కోసం కోహ్లీ పిలిచి అతడిని కంగారు పెట్టిన తీరు మ్యాచ్‌లో నవ్వు తెప్పించింది.

సాధారణంగా క్రిస్‌గేల్ సింగిల్‌కే తీసేందుకే ఆసక్తిని కనబరుస్తాడు. కానీ ఆదివారం మ్యాచ్ జరిగిన ఫిరోజ్ షా కోట్లా వేదికలో పిచ్ మందకొడిగా ఉండటంతో బౌండరీల కంటే సింగిల్స్, డబుల్స్‌పైనే కోహ్లీ ఎక్కువ ఆధారపడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన ఢిల్లీ బౌలర్ కోరె అండర్సన్ బౌలింగ్‌లో కోహ్లి బంతిని మిడ్‌వికెట్ దిశగా తరలించాడు.

అక్కడ ఫీల్డర్ లేకపోవడంతో బౌలరే స్వయంగా ఆ బంతిని అందుకునేందుకు వెళ్తుండగా.. సింగిల్ పూర్తి చేసిన కోహ్లి రెండో పరుగు కోసం క్రిస్‌గేల్‌ని పిలిచాడు. ఈ పిలుపుతో కంగారు పడిన క్రిస్‌ గేల్ నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపు వస్తూ పొరపాటున విరాట్ కోహ్లీని ఢీకొట్టబోయాడు.

ఐపీఎల్: లీగ్ ఆఖరి మ్యాచ్‌లో కోహ్లీ సేనదే విజయం

అయితే దీనిని గమనించిన విరాట్ కోహ్లీ పక్కకి తప్పుకోవడంతో మ్యాచ్ చూస్తున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Virat Kohli and Chris Gayle almost ran into each other while going for a run.
Please Wait while comments are loading...