కోహ్లీకి బుల్లి ఫ్యాన్: ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన జాంటీ రోడ్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. కోహ్లీ ఆటకు ఇండియా మొత్తం దాసోహం అయింది. తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా కోహ్లీకి ఇండియా అభిమానిగా మారిపోయింది.

అందేంటి ఇండియా అభిమానిగా మారిపోవడం ఏంటని అనుకుంటున్నారా? ఇక్క‌డ ఇండియా అంటే దేశం కాదు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెట‌ర్‌, ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ కుమార్తె పేరు ఇండియా. ఈ చిన్నారి కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్ అంట‌. విరాట్ కోహ్లీ ఉన్న పోస్ట‌ర్‌ను ఆమె హ‌గ్ చేసుకున్న ఫొటోను జాంటీ రోడ్స్ తన ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

జాంటీ రోడ్స్ ట్వీట్‌పై విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. ఇండియా రోడ్స్ చాలా క్యూట్‌గా ఉంది.. ఆమె చిన్న బ్యాగ్‌లో ఏముందో తెలుసుకోవాల‌ని ఉంది అని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యంత చెత్త ప్రదర్శన చేసి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The little one who has been named India by the legendary South African fielder is seen in this tweet by her father touching a picture of Kohli.
Please Wait while comments are loading...