పునరాలోచనలో కోహ్లీ: ధర్మశాల టెస్టుకు షమీ?

Posted By:
Subscribe to Oneindia Telugu

దరాబాద్: రాంచీ టెస్టులో టీమిండియాను విజయం ఊరించి ఉసూరుమనించింది. చివరి రోజు భారత్ విజయానికి కావాల్సింది 8 వికెట్లు. స్వదేశంలో మేటి జట్లను వరుసగా మట్టికరిపిస్తూ సిరిస్‌లు సాధిస్తున్న టీమిండియాకు ఇది అంత పెద్ద లెక్క కాదునుకున్నారు అభిమానులు.

గంట ముందు వికెట్ పడి ఉంటే: రాంచీ టెస్టు ఫలితం మరోలా!

Virat Kohli hints at Mohammed Shami's inclusion for Dharamsala Test against Australia

కానీ ఇక్కడే అంచనాలు తారుమారయ్యాయి. భారత్ విజయాన్ని ఆస్ట్రేలియా ఆటగాళ్లు పీటర్ హాండ్స్‌కోంబ్, మార్ష్‌లు అడ్డుగోడగా నిలిచారు. ఓటమి దాదాపు ఖాయమైన వేళ డ్రా కోసం కంగారూలు చివరిదాగా పోరాడిన తీరు ఆకట్టుకుంది. చివరిరోజు మన బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు.

పిచ్ సహకారం కూడా ఆస్ట్రేలియాకు బాగా కలిసొచ్చింది. ఆసీస్ ఆటగాళ్లు హాండ్స్‌కోంబ్, షాన్‌మార్ష్ మారథాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో రాంచీ టెస్టు ఎలాంటి ఫలితం లేకుండానే డ్రాగా ముగిసింది. నాలుగు టెస్ట్‌ల సిరీస్ కాస్తా 1-1తో సమం కావడంతో ఆఖరిదైన ధర్మశాల టెస్ట్‌తో సిరీస్ ఫలితం తేలనుంది.

దీంతో రాంచీ టెస్టులో బౌలర్ల వైఫల్యంతో భారత కెప్టెన్‌ కోహ్లీ పునరాలోచనలో పడినట్టు ఉన్నాడు. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే నాలుగో టెస్టుకు గాయం నుంచి కోలుకున్న పేసర్‌ మహ్మద్‌ షమీని ఆసీస్‌తో జరిగే చివరి టెస్టులో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాంచీ టెస్టు డ్రా: మ్యాచ్ బంతి నాణ్యతపై కోహ్లీ అసంతృప్తి

ఇదే విషయాన్ని మూడో టెస్టు ముగిసిన తర్వాత సూచనప్రాయంగా చెప్పాడు. తమిళనాడుతో సోమవారం జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీ ఫైనల్లో బెంగాల్‌ తరఫున ఆడిన షమీ నాలుగు వికెట్లు తీశాడు. అయితే మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసమే అతన్ని ఈ మ్యాచ్‌ ఆడాలని సూచించామని కోహ్లీ చెప్పాడు.

'సెలెక్టర్లతో మాట్లాడలేదు కానీ.. అన్నీ అనుకూలిస్తే తర్వాతి మ్యాచ్‌కు షమీని జట్టులోకి తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నాం. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసమే అతన్ని విజయ్‌ హజారే ఫైనల్‌ ఆడమని సూచించాం' అని కోహ్లీ తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India captain Virat Kohli on Monday hinted that possibility of including fit-again Mohammed Shami who got four wickets for Bengal in the Vijay Hazare Trophy final against Tamil Nadu on Monday.
Please Wait while comments are loading...