కోహ్లీ బాకీ తీరుస్తాడని భయం, ఈ చీట్ గేట్...: గిల్లీ

Posted By:
Subscribe to Oneindia Telugu

మెల్‌బోర్న్‌: టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ గొప్ప నాయకుడని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అన్నాడు. రెండు జట్లూ 2008 నాటి 'మంకీగేట్‌'లా మారకముందే 'చీట్‌గేట్‌' వివాదానికి ముంగిపు పలకాలని సూచించాడు. ధర్మశాలలో జరిగే నాలుగో టెస్టులో కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉన్నాడని అన్నాడు.

కోహ్లీ గొప్ప నాయకుడని, తన జట్టునూ దేశాన్నీ తనతో పాటు నడిపిస్తాడని, ధర్మశాలలో అతడు పరుగుల బాకీ తీరుస్తాడని భయంగా ఉందని అన్నాడు. డిఆర్ఎస్ సమీక్ష వివాదం 2008 నాటి ఘటనలా మారకముందే సద్దుమణగడం సంతోషకరం అన్నాడు.

భారత్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ సమరంలో వివాదాలు అంతర్గత భాగమని అన్నాడు. ఐతే చివరికి ప్రత్యర్థులిద్దరూ గౌరవించుకొంటారని చెప్పాడు. రెండు జట్లూ మంచి పోటీదారులని గిల్లీ కితాబిచ్చాడు. క్వింటిస్‌ను ప్రారంభిస్తూ ఆయన ఆ మాటలు అన్నారు.

 Adam Gilchrist

రెండు జట్లు కూడా తమ ప్రత్యర్థుల గురించి భయపడుతుంటాయని, దాంతో ఆట ముగిసిన తర్వాత ప్రతి రోజూ ఇరు జట్లపై గౌరవం ఉంటుందని అన్నారు. రెండు జట్లు కూడా మంచి పోటీదారులని అన్నారు. ఆస్ట్రేలియా ఆటతీరును చూసి అందరిలాగే తాను ఆశ్చర్యపడ్డానని చెప్పారు.

భారత్‌లో ఆస్ట్రేలియా ఆటతీరుపై అందరూ ఆశ్చర్యపడ్డారని, చాలా అంచనాలు వేశారని, అయితే వాళ్లు గర్వపడేలా ఆడారని, వారు అద్భుతంగా రాణించారని గిల్ క్రిస్ట్ అన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Australian cricket legend Adam Gilchrist has called Virat Kohli a great leader and said it is time for both the countries to put an end to the 'cheatgate' controversy before it turns into infamous 2008 'monkeygate' episode.
Please Wait while comments are loading...