మోడ్రన్ డే గ్రేట్: కోహ్లీకే ఓటు వేసిన ఆండ్రూ ఫ్లింటాఫ్‌

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ప్రశంసలు కురిపించాడు. మోడ్రన్ డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని కొనియాడాడు. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో స్టీవ్ స్మిత్, జో రూట్‌‌ల కంటే కోహ్లీనే అత్యుత్తమ క్రికెటర్‌ని ఫ్లింటాఫ్ అన్నాడు.

'టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌‌ ఇలా నలుగురు కెప్టెన్లను విరాట్ కోహ్లీ, స్టీవెన్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లను పరిశీలిస్తే నలుగురూ అత్యుత్తమ ఆటగాళ్లే కానీ, వీరిలో కోహ్లీనే బెస్ట్ క్రికెటర్' అని ఫ్లింటాఫ్ చెప్పాడు.

Virat Kohli is head and shoulders above Smith, Root and Williamson: Flintoff

టెస్టుల్లో విరాట్ కోహ్లీ ఆటతీరు, వ్యూహాలు చాలా బాగుంటాయని పేర్కొన్నాడు. ఇక టెస్టు క్రికెట్‌తో పోలిస్తే టీ20లలో కోహ్లీ బ్యాటింగ్ మరింత ఆసక్తిగా ఉంటుందని చెప్పాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా కోహ్లీ బౌండరీలతో చెలరేగుతాడని అన్నాడు.

మూడు ఫార్మెట్లలో కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐసీసీ ర్యాంకుల్లో టాప్ 5లో ఉన్నాడు. వరుసగా టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు చేసిన క్రికెట్ లెజెండ్స్ అయిన సర్ డాన్ బ్రాడ్ మన్, సునీల్ గవాస్కర్‌ల రికార్డులను సైతం అధిగమించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former England skipper Andrew Flintoff has praised India captain Virat Kohli and rated the latter as the best batsman among present modern day greats.
Please Wait while comments are loading...