టెస్టు ర్యాంకులు: నెంబర్‌ వన్‌ ర్యాంకుని నిలబెట్టుకున్న భారత్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గురువారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల్లో 123 రేటింగ్ పాయింట్లతో టీమిండియా నెంబర్ వన్ స్ధానంలో నిలవగా 117 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది.

తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఒక పాయింట్ సాధించగా, దక్షిణాఫ్రికా మాత్రం 109 నుంచి 117 పాయింట్లకు ఎగబాకి రెండో స్ధానంలో నిలిచింది. దీంతో భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య ఉన్న 13 పాయింట్ల గ్యాప్ ప్రస్తుతానికి ఆరు పాయింట్లకు పడిపోయింది.

మరోవైపు అగ్రస్థానంలో ఉన్న ఇరు జట్లు తమ రేటింగ్‌ను మెరుగుపరచుకోగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ రేటింగ్ తగ్గింది. మూడో ర్యాంకులో నిలిచిన ఆస్ట్రేలియా 108 రేటింగ్ పాయింట్ల నుంచి 100 రేటింగ్ పాయింట్లకు పడిపోయింది.

Virat Kohli-led India retain No. 1 Test rank after annual update

ఇక ఇంగ్లాండ్‌ 101 రేటింగ్ పాయింట్ల నుంచి 99 పాయింట్లకు దిగజారి నాలుగులో నిలిచింది. న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఐసీసీ టెస్టు ర్యాంకులు (మే 18 నాటికి):

(Read as Rank, Team, Points)

1. India 123 (+1)
2. South Africa 117 (+8)
3. Australia 100 (-8)
4. England 99 (-2)
5. New Zealand 97 (+1)
6. Pakistan 93 (-4)
7. Sri Lanka 91 (+1)
8. West Indies 75 (+5)
9. Bangladesh 69 (+3)
10. Zimbabwe 0 (-5)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India have retained their number-one position on the ICC Test Team Rankings following the annual update in which series results from 2013-14 are no longer included and outcomes from the 2015-16 series are weighted at 50 per cent.
Please Wait while comments are loading...