కోహ్లీనా మాజాకానా!: రూ.2.4 కోట్లు పలికిన పెయింటింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రపంచంలోని మోడ్రన్ క్రికెటర్లలో అత్యధిక అభిమానులు కలిగిన క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ క్రేజ్ అమాంతం పెరుగుతోంది. తాజాగా విరాట్ కోహ్లీ పెయింటింగ్‌ను ఓ అభిమాని అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

కోహ్లీ పదేళ్ల ఐపీఎల్‌ ప్రస్థానాన్ని వర్ణించే చిత్రరాజాన్ని బ్రిటిష్‌ ఇండియన్‌ పూనమ్‌ గుప్తా దాదాపు రూ.2.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు. ప్రఖ్యాత చిత్రకారుడు శషా జెఫ్రీ కోహ్లీ ఐపీఎల్‌ ప్రయాణాన్ని పెయింటింగ్‌ మార్చిన విషయం తెలిసిందే. డేవిడ్‌ బెక్‌హామ్‌, యువరాజ్ సింగ్, ధోని చారిటీల కోసం పనిచేసిన ప్రముఖ చిత్రకారుడు సాషా జెఫ్రీ ఈ పెయింటింగ్‌ను గీశారు.

కోహ్లీ ఫౌండేషన్‌ నిర్వహించిన ధార్మిక కార్యక్రమంలో గుప్తా ఈ పెయింటింగ్‌ను కొనుక్కున్నారు. 'ఈ యువతరానికి చెందిన భారత క్రికెటర్లు సమాజం పట్ల బాధ్యతతో మెలగడం నాకు నచ్చింది. వారు అటు మైదానంలో ఇటు బయటా విభిన్నంగా ఉండాలనుకుంటున్నారు. కోహ్లీ ఎంచుకొన్న కారణం నాకు బాగా నచ్చింది' అని పీజే పేపర్స్‌ సంస్థ సీఈఓ పూనమ్‌గుప్తా అన్నారు.

తన అభిమాన చిత్రకారుడు నా అభిమాన క్రికెటర్‌ పెయింట్‌ వేయడంతో కొనుక్కున్నట్లు పూనమ్‌ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
British Indian entrepreneur Poonam Gupta has bought a painting depicting Virat Kohli's IPL journey over 10 years for a whopping 2.9 million pounds.
Please Wait while comments are loading...