ధోని సలహాలు వెలకట్టలేనివి: దక్షిణాఫ్రికా విజయంపై కోహ్లీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

భారత బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధవాన్ 78, కోహ్లీ 76(నాటౌట్), యువరాజ్ సింగ్ 23(నాటౌట్), రోహిత్ శర్మ 12 పరుగులు చేశారు. అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాప్రికా 44.3 ఓవర్లకు 191 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

Virat Kohli praises MS Dhoni captaincy assistance

తాజా విజయంతో టీమిండియా సెమీస్‌కు చేరగా, దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి వైదొలగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ సెమీఫైనల్ చేరాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ పైనల్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది.

మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ధోనిపై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని లాంటి అనుభ‌వ‌మున్న వ్య‌క్తి స‌ల‌హాలు వెలక‌ట్టలేనివని కోహ్లీ చెప్పాడు. ధోని సుచ‌న‌లు ఏ ప‌రిస్థితుల్లోనైనా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పుకొచ్చాడు.

ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, దక్షిణాఫ్రికా జట్టు వాళ్లు క‌ల‌గ‌జేసిన ఒత్తిడి కార‌ణంగా తాము పైచేయి సాధించ‌గ‌లిగామ‌ని కూడా కోహ్లీ చెప్పాడు. గురువారం జ‌ర‌గ‌నున్న రెండో సెమీఫైన‌ల్లో భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Virat Kohli and Shikhar Dhawan shared a 128-run stand as India reached South Africa’s 192-run target in 38 overs. Earlier, Indian bowlers restricted South Africa to 191 in a must-win ICC Champions Trophy 2017 match.
Please Wait while comments are loading...