నేను, రికీ పాంటింగ్ కలిస్తే విరాట్ కోహ్లీ: స్టీవ్ వా ప్రశంసలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తాను, రికీ పాంటింగ్ కలిస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటూ ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా ప్రశంసలు కురిపించాడు. గురువారం మీడియాతో మాట్లాడిన స్టీవ్ నా కోహ్లీ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు.

కోహ్లీపై స్టీవ్ వా ఆసక్తికర వ్యాఖ్యలు: ఏమన్నాడంటే....

'కోహ్లీ కెప్టెన్సీ నేను, రికీ కలిస్తే ఎలా ఉందో అలా ఉంది. కోహ్లీ నాయకత్వ లక్షణాలు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. అతడి నాయకత్వ లక్షణాలు విలక్షణమైనవి. అతను ఎంతో దూకుడు కలిగిన కెప్టెన్. అతను జట్టు సహచరులకు స్ఫూర్తి అందించడంలో ముందుంటాడు' అని స్టీవ్ వా చెప్పాడు.

Virat Kohli reminds of Ricky Ponting and myself with his captaincy: Steve Waugh

'కోహ్లీ శరీర భాష ఆ విషయాన్ని నిరూపిస్తుంది. ఈ విషయంలో అతను నన్ను గుర్తు చేస్తున్నాడు. మనం ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉంటే జట్టు దృక్పథాన్ని మార్చగలం. ఈ విషయంలో కోహ్లీ మరికాస్త ముందున్నాడని, జట్టు అంతా అతనికోసమే ఆడుతోంది. ఓ కెప్టెన్‌కు ఇది చాలా గర్వకారణం' అని తెలిపాడు.

కెప్టెన్సీని కోహ్లీ ఎంతో ఎంజాయ్ చేస్తాడని పేర్కొన్నాడు. నిజం చెప్పాలంటే కోహ్లీ 'న్యూ ఫేస్ ఆఫ్ ఇండియా' అంటూ కితాబిచ్చాడు. అతని దూకుడు, జట్టు సహచరులతో అతడు మెలిగే తీరు, కెప్టెన్‌గా అతడి నాయకత్వ లక్షణాలు ఉన్నతంగా ఉన్నాయని తెలిపాడు. కాగా, బెంగళూరు టెస్టులో డీఆర్‌ఎస్ వివాదం, కోహ్లీని ట్రంప్‌తో ఆసీస్ మీడియా పోల్చడంపై స్టీవ్ వా పైవిధంగా స్పందించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Australia skipper Steve Waugh on Thursday (March 23) hailed Virat Kohli's leadership, saying he sees elements of himself and his successor Ricky Ponting in the Indian's leadership.
Please Wait while comments are loading...