పాకిస్థాన్ పిజ్జా హ‌ట్‌లో ప‌నిచేస్తున్న‌ విరాట్ కోహ్లీ! (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే 'కోహ్లీ పాకిస్తాన్‌లో ఉన్నాడంటూ' సోషల్ మీడియాలో కలకలం రేగింది. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన ఓ వ్యక్తి అచ్చం కోహ్లీని పోలి ఉండటంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అయింది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు

టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఏంటి? పాకిస్థాన్ వెళ్ల‌డ‌మేంటి? అక్క‌డ పిజ్జా హ‌ట్‌లో ప‌నిచేయ‌డ‌మేంటి? కానీ ఈ వీడియో చూస్తే మాత్రం నిజంగానే కోహ్లీ అక్క‌డికి వెళ్లాడా? అనిపిస్తుంది. ఇక్క‌డ క‌నిపిస్తున్న వ్య‌క్తి కోహ్లీ కాదు. అచ్చూ అత‌న్ని పోలిన వ్య‌క్తి. ప్రస్తుతం 'పాకిస్తాన్‌ కోహ్లీ'గా నెటిజన్లు పిలుస్తోన్న ఆ వ్యక్తి కరాచీలోని ఓ పిజ్జా సెంటర్‌లో పనిచేస్తున్నాడు.

 Virat Kohli's Double Spotted at a Pizza Outlet In Karachi

అతడి పేరు షహీద్‌-ఎ-మిలత్‌. తనపని తాను చేసుకుంటున్న షహీద్‌ను వీడియోతీసి 'జస్ట్‌ పాకిస్తానీ థింగ్స్‌' ఫేస్‌బుక్‌ పేజీలో అప్‌లోడ్‌ చేశారు. కోహ్లీ అంటే పాకిస్తాన్‌లోనూ విపరీతమైన క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై 'పాకిస్థాన్‌లో కోహ్లీ..' అంటూ భారత క్రికెట్ అభిమానులు సరదాగా కామెంట్‌ చేశారు.

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌, పాకిస్తాన్‌ జట్లు రెండూ సెమీస్‌లోకి అడుగుపెట్టాయి. జూన్‌ 14న పాకిస్థాన్-ఇంగ్లాడ్‌తో తలపడనుండగా, జూన్‌ 15న ఇండియా- బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ లీగ్‌ దశలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kohli's doppelganger isn't a professional cricketer but works at a pizza outlet in Shaheed-e-Millat, Karachi. His video, which stunned cricket lovers, was uploaded by 'Just Pakistani Things' on Facebook.
Please Wait while comments are loading...