ఆ పోస్ట్‌కి అర్ధం ఏమిటి: కోహ్లీ న్యూయార్క్ పర్యటన ముగిసిందా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి తన ప్రేయసి అనుష్క శర్మల న్యూయార్క్ పర్యటన ముగిసింది. ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం అటు నుంచి అటే నేరుగా శ్రీలంక పర్యటనకు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఐదు వన్డేలు, ఏకైక టీ20 సిరిస్ ఆడిన సంగతి తెలిసిందే.

వన్డే సిరిస్‌ను 3-1తో కైవసం చేసుకోగా, ఏకైక టీ20లో ఓటమి పాలైంది. విండిస్ పర్యటన అనంతరం కెప్టెన్ కోహ్లీ నేరుగా న్యూయార్క్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్ పర్యటన ముగించుకుని కోహ్లీ భారత్‌కు తిరుగు పయనమయ్యాడు.

న్యూయార్క్‌లోని ఓ మ్యూజియంను సందర్శించిన కోహ్లీ.. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ తర్వాత ఓ కారులో ప్రయాణిస్తున్న ఫొటోను కోహ్లీ ట్విట్టర్‌లో పోస్టు చేసి 'తిరిగి యథాస్థితికి' అనే కామెంట్ పెట్టాడు.

ఈ ట్వీట్‌ను బట్టి చూస్తుంటే కోహ్లీ భారత్‌కు పయనమైనట్లు తెలుస్తోంది. జులై 14, 15న న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్‌ మైదానంలో జరిగిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి అనుష్కతో కలిసి హాజరయ్యేందుకే కోహ్లీ న్యూయార్క్‌కు వెళ్లాడు.

ఇదిలా ఉంటే త్వరలో కోహ్లీ సేన శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఏకైక టీ20లతో కూడిన సిరిస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జులై 26 నుంచి ప్రారంభం కానుంది.

కోహ్లీ అభిమానులు ట్విటర్లో పోస్టు చేసిన ఓ ఫోటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీన్ని చూసేందుకు రెండూ కళ్లూ చాలడంలేదని కోహ్లీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. న్యూయార్క్‌లోని ఓ సూపర్ మార్కెట్లో చెరో ట్రాలీ బాస్కెట్ పట్టుకున్న ఈ సెలబ్రిటీ జంట సీరియస్‌గా ముచ్చటించుకుంటున్న దృశ్యం నిజంగానే చూడముచ్చటగా ఉంది.

''వీళ్ల ముఖాల్లో హావభావాలు చాలా క్యూట్‌గా ఉన్నాయి. అప్పుడు అనుష్క ఏం ఆలోచిస్తుందో!'' అని ఓ అభిమాని వ్యాఖ్యానించగా... ''ఎంజాయ్ చిక్కూ... మనసు దోచుకోవడంలో నువ్వే ముందు..'' అని మరొకరు ఆశీర్వచనాలు పలికేశారు!

Virat and Anushka makes a Fan Happy in New York! 😇❤️ #NewYorkDiaries

A post shared by Virat Kohli (@viratkohli.club) on Jul 14, 2017 at 5:48am PDT

Virushka making a Fan Happy! 😇❤️ #NewYorkDiaries #USAvacation

A post shared by Virat Kohli (@viratkohli.club) on Jul 13, 2017 at 9:17pm PDT

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India skipper Virat Kohli's holiday pictures with his girlfriend Anushka Sharma have been breaking the internet in the past few days. But it seems that Kohli's dream vacation in New York has come to an end as he took to Twitter and posted a selfie from the inside of a moving car and the caption read, "Back to the grind again."
Please Wait while comments are loading...