రాఖీ పౌర్ణమి: కెప్టెన్ కోహ్లీతో సహా ఇలా శుభాకాంక్షలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సోమవారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. పలువురు క్రీడాకారులు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం లంక పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

అంతేకాదు రాఖీ పౌర్ణమి నాడు తన సోదరిని మిస్సవుతున్నట్లు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మందాన తన సోదరుడికి రాఖీ కట్టి 'ప్రపంచంలోనే నా బెస్ట్‌ బ్రదర్‌కి రాఖీ శుభాకాంక్షలు' అని ట్విట్టర్‌లో పోస్టు చేసింది. రాఖీ పౌర్ణమి నాడు పలువురు క్రీడాకారులు ఇలా శుభాకాంక్షలు తెలిపారు.

విరాట్ కోహ్లీ

ప్రపంచంలో రక్షా బంధన్‌ జరుపుకొంటున్న వారందరికీ ఇవే నా శుభాక్షాంక్షలు. ఈ రోజు అక్కతో పాటు ఇంట్లో ఉన్న అందర్నీ మిస్సవుతున్నాను.

వీరేంద్ర సెహ్వాగ్‌

చిన్నతనంలో సోదరీతో గడిపిన సమయాన్ని ఎవరూ మరిచిపోలేరు. అంజు, మంజు, గుంజుకి హ్యాపీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు.

స్మృతి మందాన

ప్రపంచంలోనే ఉత్తమ సోదరుడికి హ్యాపీ రక్షాబంధన్‌

హర్భజన్‌ సింగ్‌

ఈ రోజు సోదరీమణులు చేతికి రాఖీలు కట్టి సోదరుడి పట్ల తమకు ఉన్న ప్రేమను తెలియజేస్తారు. ప్రతి ఒక్కరికీ రక్షా బంధన్‌ శుభాకాంక్షలు

మహమ్మద్‌ కైఫ్‌

నీ సోదరిని ఎలా చూసుకుంటావో ప్రతి మహిళను అలాగే చూసుకో.

రహానే

ప్రతి ఒక్కరికీ రక్షా బంధన్‌ శుభాకాంక్షలు. మీ సోదరీమణులను కాపాడుతూ, జాగ్రత్తగా చూసుకోండి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On the occasion of Raksha Bandhan, many celebrities have taken to social media to wish their siblings. Among them is Indian cricket team's captain Virat Kohli, who put up the sweetest post to wish everyone a happy Raksha Bandhan.
Please Wait while comments are loading...