తప్పనిసరి అయితేనే బ్యాటింగ్‌కు దిగు: కోహ్లీకి సన్నీ హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భుజం నొప్పి గాయంతో బాధపడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగి రిస్క్ చేయడం జట్టుకు మంచిది కాదని క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ హెచ్చరించాడు. అంతేకాదు తప్పనిసరి అయితేనే బ్యాటింగ్‌కు దిగాలని సూచించాడు.

ఎన్డీటీవీకి సునీల్ గవాస్కర్ ఇంటర్యూ ఇచ్చాడు. 'కోహ్లీ నాలుగో స్దానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని నేను భావించడం లేదు. తప్పనిసరి అయితేనే బ్యాటింగ్‌కు రావడం మంచిది. అంతేతప్ప బ్యాటింగ్‌కు దిగి రిస్క్ చేయడం జట్టుకు మంచిది కాదు' అని గవాస్కర్ చెప్పాడు.

రాంచీ టెస్టు తొలిరోజు ఆటలో భాగంగా ఫీల్డింగ్‌ సందర్భంగా భుజానికి కోహ్లీ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. శుక్రవారం కోహ్లీ డ్రస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యాడు. శుక్రవారం ఉదయం టీమిండియాతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్న కోహ్లీ ఆటకు మాత్రం దూరమయ్యాడు.

కోహ్లీ పూర్తిగా విశ్రాంతి తీసుకోవడమే మంచిది

కోహ్లీ పూర్తిగా విశ్రాంతి తీసుకోవడమే మంచిది

ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కోహ్లీ పూర్తిగా విశ్రాంతి తీసుకోవడమే మంచిదని గవాస్కర్‌ చెప్పాడు. పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తుంది కాబట్టి కోహ్లీపై బ్యాటింగ్‌ భారం పడకుండా ఉం డాలంటే విజయ్‌, పుజారా, రహానే భారీ ఇన్నింగ్స్‌ ఆడితే జట్టుకు లాభిస్తుందని అన్నాడు.

కెప్టెన్‌గా రహానే

కెప్టెన్‌గా రహానే

కోహ్లీ స్థానంలో వైస్ కెప్టెన్ రహానె కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. తొలిరోజు భారత ఫిజియో సహాయంతో బయటకు వెళ్లిన కోహ్లీ శుక్రవారం బరిలోకి దిగలేదు. కోహ్లీ గాయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. కోహ్లీ గాయం తీవ్రమైంది కాదని, మిగతా మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండేందుకు తగిన చికిత్స కొనసాగుతోందని అందులో పేర్కొంది.

కోహ్లీ భుజానికి స్కానింగ్‌

కోహ్లీ భుజానికి స్కానింగ్‌

గురువారం సాయంత్రం కోహ్లీ భుజానికి స్కానింగ్‌ నిర్వహించారు. ఫలితాలు వచ్చిన అనంతరం అతని గాయం తీవ్రమైనదేమీ కాదని, మెల్లగా కోలుకుంటున్నాడని బీసీసీఐ అందులో పేర్కొంది. అతని భుజానికి చికిత్స నిర్వహిస్తున్నట్లు బోర్డు వైద్య బృందం స్పష్టం చేసింది. రాంచీ టెస్టులో బరిలోకి దిగే విధంగా చికిత్సను కొనసాగిస్తామని వెల్లడించింది.

ఫిట్‌గానే కోహ్లీ

మరోవైపు టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ మాత్రం కెప్టెన్ కోహ్లీ ఫిట్ గానే ఉన్నాడని చెప్పాడు. రాంచీ టెస్టులో కోహ్లీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sunil Gavaskar feels India skipper Virat Kohli should not bat in the Ranchi Test unless it is absolutely essentially to make sure he did not aggravate his shoulder injury.
Please Wait while comments are loading...