కుంబ్లేతో కష్టం: సీఏసీకి తేల్చి చెప్పిన కోహ్లీ, ఏం చేస్తారో!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లేని కొనసాగించడాన్ని కెప్టెన్ కోహ్లీ ఎంత మాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కుంబ్లే తీరుపై క్రికెట్ సలహా కమిటీ ముందు కోహ్లీ తన అసంతృప్తిని మరోసారి వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.

ఇద్ద‌రి మ‌ధ్య విభేదాల‌ను ప‌రిష్క‌రించ‌డానికి స‌చిన్‌, గంగూలీ, ల‌క్ష్మ‌ణ్‌ల‌తో కూడిన క్రికెట్ సలహా కమిటీ రంగంలోకి దిగిన విష‌యం తెలిసిందే. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కి ముందు శనివారం సాయంత్రం కెప్టన్ కోహ్లీ క‌మిటీ ముందు హాజ‌ర‌య్యాడు.

ఈ సమావేశానికి బీసీసీఐ సీఈఓ రాహులో జోహ్రీ, తాత్కాలిక సెక్రటరీ అమితాబ్ చౌధురి, బీసీసీఐ జనరల్ మేనేజర్ (క్రికెట్) డాక్టర్ ఎమ్‌వి శ్రీధర్ కుడా హాజరయ్యారు. ఈ సమావేశం గంటపాటు జరిగిందని లండన్‌కు చెందిన ది టెలిగ్రాఫ్ రాసుకొచ్చింది.

కుంబ్లేతో విసిగిపోయాను

కుంబ్లేతో విసిగిపోయాను

ఈ సంద‌ర్భంగా కుంబ్లే తీరుతో తాను విసిగిపోయాన‌ని కోహ్లీ చెప్పిన‌ట్లు బీసీసీఐలోని ఓ అధికారి వెల్ల‌డించాడు. కుంబ్లే విష‌యంలో త‌న ఉద్దేశం ఏంటో కోహ్లీ స్ప‌ష్టంగా చెప్పాడు. అత‌ని మాట‌లు చూస్తే.. వీళ్ల మ‌ధ్య విభేదాలు పరిష్కార‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. అయితే సీఏసీ కుంబ్లేను కూడా క‌లిసి తుది నిర్ణ‌యం తీసుకుంటుంది అని ఆ అధికారి చెప్పాడు.

క్రికెట్ సలహా కమిటీ ముందు కుంబ్లే

క్రికెట్ సలహా కమిటీ ముందు కుంబ్లే

ఇదిలా ఉంటే సోమవారం లండన్‌లో క్రికెట్ సలహా కమిటీ ముందు కుంబ్లే హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ సలహా కమిటీని కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. టీమిండియా ప్రధాన కోచ్‌గా కుంబ్లే బాధ్యతలను నెరవేరుస్తున్నప్పటి నుంచి టీమిండియా అద్భుతమైన విజయాలను సాధించింది.

కుంబ్లే పర్ఫార్మెన్స్‌ అదుర్స్

కుంబ్లే పర్ఫార్మెన్స్‌ అదుర్స్

ఇలాంటి పరిస్థితుల్లో కుంబ్లే పర్ఫార్మెన్స్‌ను ఎక్కడా తక్కువ చేసి చూసే పరిస్థితి లేదు. మరి, కుంబ్లేను తొలగించడం ఎలా? హెడ్ కోచ్ ను తొలగించాలంటూ డిమాండ్ చేయడానికి కెప్టెన్‌కు ఉన్న అధికారం ఏమిటి? ఒకవేళ కుంబ్లే స్థానంలో వేరొకరిని ప్రధాన కోచ్‌గా నియమిస్తే, అతనితో కోహ్లీ సర్దుకుపోతాడనే గ్యారంటీ ఏముంది?

కమిటీని వేధిస్తోన్న ప్రశ్నలు

కమిటీని వేధిస్తోన్న ప్రశ్నలు

ఇలాంటి ప్రశ్నలు క్రికెట్ సలహా కమిటీని వేధిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ స‌మ‌స్య‌కు కమిటీలో ఉన్న ముగ్గురు లెజెండ్స్ ఎలాంటి ప‌రిష్కారం చూపిస్తారో అని అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి కమిటీలో ఉన్న ముగ్గురూ కుంబ్లేకి మంచి మిత్రులు.

వెస్టిండిస్ పర్యటనకు కోచ్‌గా కుంబ్లే

వెస్టిండిస్ పర్యటనకు కోచ్‌గా కుంబ్లే

వీరంతా కుంబ్లే వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు సుప్రీం కోర్టు నియమించిన పరిపాలనా కమిటీ కూడా కుంబ్లే వైపు మొగ్గు చూపడం విశేషం. త్వరలో ప్రారంభం కానున్న వెస్టిండిస్ పర్యటనకు కూడా కుంబ్లేనే కొన‌సాగుతాడ‌ని బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Cricket Advisory Committee (CAC) comprising of Sachin Tendulkar, Sourav Ganguly and VVS Laxman are in a fix after India captain Virat Kohli expressed “strong reservations” over Anil Kumble continuing as coach.
Please Wait while comments are loading...