బంగ్లా నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది, ఊహించలేదు: కోహ్లీ

Subscribe to Oneindia Telugu

బర్మింగ్‌హామ్: బంగ్లాదేశ్ జట్టుపై ఇంత సులుభమైన విజయాన్ని తాను ఊహించలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. బంగ్లాదేశ్ నుంచి గట్టి పోటీ వస్తుందని భావించానని, అయితే, ఎలాంటి పోరాటం లేకుండానే ఆ జట్టు తమకు లొంగిపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని కోహ్లీ పేర్కొన్నాడు.

9వికెట్ల భారీ విజయం

9వికెట్ల భారీ విజయం

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 9వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ మాట్లాడారు.

ప్రమాదకరమనుకున్నా..

ప్రమాదకరమనుకున్నా..

ప్రమాదకరమైన జట్టుగా పరిగణించిన బంగ్లాదేశ్ జట్టు ఘోరంగా ఓడిపోవడం తనను ఆశ్యర్యానికి గురిచేసిందన్నారు. 9వికెట్ల భారీ తేడాతో ఇంత సులువుగా గెలుస్తామని తాను ఊహించలేదని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

సహజంగా ఆడేందుకు..

సహజంగా ఆడేందుకు..

‘ఇంత భారీ విజయం సాధిస్తామని ఊహించలేదు. టాప్ ఆర్డర్‌లో నాణ్యమైన క్రికెట్ ఆడాం. ఓపెనర్లు ఇద్దరూ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారు. దీంతో నేను ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా సహజంగా ఆడటానికి అవకాశం లభించింది' అని పేర్కొన్నాడు.

కీలక వికెట్ల తీయడంతో..

కీలక వికెట్ల తీయడంతో..

అంతేగాక, తమ జట్టు బౌలింగ్‌లోనూ బాగా రాణించిందని అన్నాడు. కీలక వికెట్లను తీయడంతో దూకుడు తగ్గిందని, జాదవ్ బాగా బౌలింగ్ చేశాడని తెలిపాడు. 300 పరుగులు ఛేదించాల్సి వస్తుందని అనుకున్నా, కానీ, జాదవ్ బౌలింగ్ కీలక వికెట్లను తీయడంతో మ్యాచ్ స్వరూపం మారిందని కోహ్లీ తెలిపాడు.

పాకిస్థాన్‌తో ఫైనల్..

పాకిస్థాన్‌తో ఫైనల్..

బంగ్లా 264 పరుగుల చేయగా, 9ఓవర్లు మిగిలుండగానే టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. ఆదివారం జరిగే ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. కాగా, పాక్ మ్యాచ్ అంటే ప్రత్యేకతేమీలేదని, మరో మ్యాచ్ మాదిరిగానే చూస్తామని కోహ్లీ తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Virat Kohli said Kedar Jadhav's two wickets in the middle were crucial as India restricted Bangladesh to a below-par score in their ICC Champions Trophy semi-final and then romped home with nine wickets to spare.
Please Wait while comments are loading...