న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టెస్టులో కోహ్లీ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడా?

కోహ్లీపై బాల్ టాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. రాజ్ కోట్ టెస్టులో విరాట్ కోహ్లీ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ బ్రిటిష్‌ దిన పత్రిక ‘ది డెయిలీ మెయిల్‌’ మంగళవారం ఓ కథనాన్ని ప్రచురించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై బాల్ టాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ బ్రిటిష్‌ దిన పత్రిక 'ది డెయిలీ మెయిల్‌' మంగళవారం ఓ కథనాన్ని ప్రచురించింది.

Virat Kohli tampered with ball during 2nd England Test, alleges British tabloid

హోబర్ట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ పా డుప్లెసిస్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడటంతో ఐసీసీ అతడికి మ్యాచ్‌లో వంద శాతం జరిమానా విధించిన మరుసటి రోజునే కోహ్లీపై ఈ వార్తలు వార్తలు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

తన నోట్లో ఉన్న తెల్లటి పదార్థాన్ని తీసి బంతికి అద్దుతూ దానికి మెరుపు తెచ్చేందుకు కోహ్లీ ప్రయత్నించాడని అందుకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. అందులో కోహ్లీ కుడి చేతిని నోట్లో పెట్టుకోవడం, దాంతో బంతిని రుద్దుతుండగా టీవీ కెమెరాలు బంధించాయి.

రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి పాలైన తర్వాత బ్రిటన్ పత్రిక ఈ కథనం రాయడంపై పలువురు మాజీలు మండిపడుతున్నారు. కోహ్లీపై కావాలనే ఆరోపణలు చేస్తోందన్న విమర్శలు గుప్పించారు. దీనిపై ఇంగ్లాండ్ జట్టు ఫిర్యాదు చేయలేదు. దీంతో కోహ్లీపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవేనని అంటున్నారు.

ఐసీసీ నియామవళి ప్రకారం టెస్టు మ్యాచ్ ముగిసిన ఐదు రోజుల్లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన ఆటగాడిపై ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే రాజ్‌కోట్ టెస్టు ఈ నెల 13వ తారీఖున ముగిసింది. దీనిని బట్టి చూస్తే ఇంగ్లాండ్ ఫిర్యాదు చేయాలనుకుంటే 18వ వరకు ఆ సమయం ఉంది.

అయితే, ఈ పది రోజుల్లో కోహ్లీపై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో విశాఖ టెస్టు ఓటమిని తట్టుకోలేకే బ్రిటన్‌ మీడియా కోహ్లీపై కావాలనే విమర్శలు చేస్తోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X