ఆడికి ధన్యవాదాలు: కొత్త కారులో కెప్టెన్ కోహ్లీ షికారు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి స్పీడ్‌గా పోయే కార్లంటే ఎంతో ఇష్టం. ఇక జర్మనీ కార్ల తయారీ సంస్ధ ఆడి రూపొందించే కార్లు అంటే ఇంకా ఇష్టం. ఇప్పటికే కోహ్లీ వద్ద ఐదు ఆడి కార్లు ఉన్నాయి. తాజాగా అతడి కార్లలో తెలుపు రంగు ఆడి క్యూ7 వచ్చి చేరింది.

భారత్‌లో 'ఆడి' కార్ల అమ్మకాలు ప్రారంభమై పదేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆడి కార్ల సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విరాట్ కోహ్లీకి ఆ సంస్థ క్యూ7 కారును బహుమతిగా అందజేసింది. తన ప్రయాణాన్ని అప్‌గ్రేడ్‌ చేసిన ఆడికి ధన్యవాదాలు అంటూ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్‌ చేశాడు.

కోహ్లీతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా లగ్జరీ కార్లు అంటే ఎంతో ఇష్టమని గతంలో పలు సందర్భాల్లో ప్రస్తావించారు. కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో ఓ అర్ధరాత్రి జరిగిన కార్ రేస్‌లో ధోనిపై విజయం సాధించానని అప్పట్లో కోహ్లీ వెల్లడించాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ పదో సీజన్‌లో కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెత్త ప్రదర్శనతో ప్లే ఆఫ్‌‌కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా, త్వరలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లాండ్‌ వెళ్తున్న సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Team India skipper Virat Kohli's love for speed is not hidden from anyone. The Delhi cricketer has, on several occasions, expressed his love for sports cars and his desire to run these high speed vehicles on the road.
Please Wait while comments are loading...