ఎదుర్కోవడం చాలా కష్టం: హాకీ జట్టుకు ఆల్ ద బెస్ట్ చెప్పిన కోహ్లీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆదివారం టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో మధ్యాహ్నాం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

సాయంత్రం 6.30 గంటలకు భారత్-పాక్ హాకీ మ్యాచ్

సాయంత్రం 6.30 గంటలకు భారత్-పాక్ హాకీ మ్యాచ్

భారత్-పాక్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రారంభమైన కొద్దిగంటల్లో ప్రపంచ హాకీ లీగ్‌ సెమీస్‌ టోర్నీలో భాగంగా లండన్‌లో భారత్‌-పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభంకానుంది.

భారత హకీ జట్టుకు విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు

భారత హకీ జట్టుకు విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు

భారత్-పాక్ మ్యాచ్ ఫైనల్‌కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ భారత హకీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. 'ప్రపంచ హాకీ లీగ్‌ సెమీస్‌లో భాగంగా పాక్‌తో తలపడుతోన్న భారత జట్టుకు ఇవే నా శుభాకాంక్షలు. ఇండోర్‌లో నెట్‌ సెషన్‌లో సింథటిక్‌ హాకీ బంతులతో ప్రాక్టీస్‌ చేసేవాడిని. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉండేది'

నేనెప్పుడూ హాకీ ఆడేందుకు ప్రయత్నించలేదు

నేనెప్పుడూ హాకీ ఆడేందుకు ప్రయత్నించలేదు

'నేనెప్పుడూ హాకీ ఆడేందుకు ప్రయత్నించలేదు అని కోహ్లీ తెలిపాడు. హాకీలో పెనాల్టి కార్నర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. దీనికి చాలా ధైర్యం కావాలి. మనవాళ్లు ఎలా ఎదుర్కోగలుగుతున్నారో నాకు ఇప్పటికీ తెలియదు. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాను' అని కోహ్లీ చెప్పాడు.

లండన్‌లోని మిల్టన్‌ కీన్స్‌లో

లండన్‌లోని మిల్టన్‌ కీన్స్‌లో

ఇదిలా ఉంటే లండన్‌లోని మిల్టన్‌ కీన్స్‌లో హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్లో ఇండో-పాక్‌లు ఢీకొననున్నాయి. క్రికెట్‌లాగే ఈ హాకీ మ్యాచ్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూల్‌-బిలో ఉన్న భారత్‌ ఆడిన రెండు మ్యాచ్‌లో ఘన విజయాలు సాధిస్తే.. నెదర్లాండ్స్‌, కెనడా చేతిలో పాక్‌ చిత్తుగా ఓడింది. మన్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని భారత డిఫెన్స్‌ బలంగా ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ahead of their FIH Hockey World League Semifinals match against Pakistan, Indian cricket team captain Virat Kohli has wished his hockey counterparts all the best. The 28-year old, who himself is gearing up for the Champions Trophy final against Pakistan, also expressed his admiration for the guts shown by the hockey players.
Please Wait while comments are loading...