సీజన్‌ను నెం.1తో ముగించిన భారత్: గదతో పాటు కోహ్లీకి రూ.6.6 కోట్ల చెక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో ఈ సీజన్‌ను టీమిండియా నెంబర్ వన్ ర్యాంకుతో ముగించింది. ఈ సీజన్‌ను నెంబర్ వన్ ర్యాంకుతో ముగించిన భారత్‌కు ఐసీసీ టెస్టు చాంఫియన్‌షిప్‌ అవార్డు దక్కింది. ధర్మశాల మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ కోహ్లీ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా అందుకున్నాడు.

ఐసీసీ బహుకరించే టెస్టు చాంపియన్‌షిప్ అవార్డు ద్వారా భారత్‌కు ఒక మిలియన్ డాలర్ల ఫ్రైజ్ మనీతో పాటు గద లభించాయి. దీంతో ఏప్రిల్‌ 1 నాటికి టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండే జట్టుకు అందించే మిలియన్‌ డాలర్ల చెక్కును మంగళవారం కోహ్లీ అందుకున్నాడు.

Virat kohli with Test Truncheon

పుణెలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ విజయం సాధించడంతో ఇరుజట్ల మధ్య పాయింట్ల పట్టికలో స్వల్ప తేడా కనిపించింది. అనంతరం బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో భారత్‌ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో వ్యత్యాసం పెరిగింది. దీంతో టీమిండియా నెంబర్ వన్ ర్యాంకుకు ముప్పు తప్పింది.

దీంతో చివరి రెండు టెస్టులు ఆసీస్‌ చేతిలో ఓడినా అగ్రస్థానానికి ఢోకా లేకుండా ఉండేది. మూడో టెస్టును డ్రా ముగించి, నాలుగో టెస్టులో విజయం సాధించిన టీమిండియా నెంబర్ వన్ ర్యాంకుని కైవసం చేసుకుంది. ప్రస్తుతం టెస్టుల్లో భారత్ 121 పాయింట్లతో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతోంది.

109 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్ధానంలో ఉండగా, మూడో స్థానంలో దక్షిణాఫ్రికా 107, నాలుగు, ఐదు స్థానాల్లో ఇంగ్లాండ్ 101, న్యూజిలాండ్ 98లు ఉన్నాయి. కాగా, ఈ మార్చి 31తో 2016/17 సీజన్‌ ముగియనున్న సంగతి తెలిసిందే. ఆసీస్‌పై టెస్టు సిరిస్‌ను నెగ్గడంతో స్వదేశంలో వరుసగా ఏడు సిరిస్‌లను భారత్ కైవసం చేసుకుంది.

స్వదేశంలో 2015 నుంచి టెస్టుల్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. 2015 నుంచి స్వదేశంలో 25 టెస్టులు ఆడిన భారత్‌ ఏకంగా 21 విజయాలు నమోదు చేసింది. రెండు టెస్టుల్లో ఓటమి పాలైన టీమిండియా, మరో రెండింటిని డ్రాగా ముగించింది. కివీస్ 3-0, ఇంగ్లాండ్ 4-0, బంగ్లా 1-0, ఆసీస్‌తో 2-1 తేడాతో టెస్టు సిరిస్‌లను భారత్ కైవసం చేసుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India might have beaten Australia in Dharamsala to win the series but Virat Kohli, Ajinkya Rahane and their teammates will have to accept th efact that the Aussies finished a very close second. In the end, it came down to that post lunch session on Day 3 of the Dharamsala Test, which tilted the balance in favour of India.
Please Wait while comments are loading...