మనీ ట్రాన్స్‌ఫర్ చేయవూ!: జడేజాకు సెహ్వాగ్ స్పెషల్ రిక్వెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉంటూ తనదైన శైలితో ట్వీట్లు చేస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటాడు.

 Virender Sehwag has a special request for Ravindra Jadeja

ఈసారి టీమిండియా ఆల్ రౌండర్ జడేజాను ఉద్దేశించి సెహ్వాగ్ సరదాగా ఓ ట్వీట్ చేశాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన జడేజాకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డుని అందుకున్నాడు.

ఈ అవార్డు కింద జడేజాకు లక్ష రూపాయల పేటీఎం క్యాష్‌ ప్రైజ్‌ దక్కింది. 'వాహ్ జడ్డూ భాయ్. 2000 నోట్లకు చిల్లర దొరక్క మేము ఇబ్బందులు పడుతుంటే నువ్వు ఏకంగా నీ పేటీఎమ్‌లో లక్ష రూపాయలు జమ చేసేసుకున్నావు. అందులో నుంచి కొంచెం నాకు ట్రాన్స్ ఫర్ చేయి ప్లీజ్', అంటూ సరదాగా ట్వీట్ చేశాడు.

ఇంగ్లాండ్‌తో మొహాలి వేదికగా జరిగిన మూడో టెస్టులో 90 పరుగులు సాధించి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్న జడేజా జట్టుని పటిష్ట స్థితిలో నిలిపాడు. అంతేకాదు మొహాలి టెస్టులో సాధించిన 90 పరుగులే టెస్టు క్రికెట్‌లో జడేజా సాధించిన అత్యధిక స్కోరు. అంతకుముందు జడేజా అత్యధిక టెస్టు స్కోరు 68గా ఉంది.

మొహాలి టెస్టు: కోహ్లీ కోరడంతో బ్యాట్‌ని కత్తిలా తిప్పిన జడేజా

ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన జడేజా 90 పరుగులతో అర్థశతకం సాధించాడు. అంతేకాదు అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత జడేజా మైదానంలో తన చేతిలో ఉన్న బ్యాట్‌ని కత్తిలా తిప్పిన సంగతి కూడా తెలిసిందే. ఇదంతా కెప్టెన్ కోహ్లీ మేరకే చేసినట్లు మ్యాచ్ అనంతరం జడేజా స్పష్టం చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Indian cricketer Virender Sehwag continues to make the news on social media. This time he had a special request for Ravindra Jadeja. Jadeja’s heroics with both bat and ball saw India win the Mohali Test to take a 2-0 lead in the series. Sehwag was surely mighty pleased with the effort of the Saurashtra lad.
Please Wait while comments are loading...