మీ పేరేంటో నాకు తెలుసు: కోహ్లీని ఇంటర్యూ చేసిన బుడతడు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కి ముందు టీమిండియాను ఓ బుడ‌త‌డు ఇంట‌ర్వ్యూ చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు

జట్టులోని ప్రతి ఆటగాడితో ప్రత్యేకంగా మాట్లాడాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు భువ‌నేశ్వ‌ర్‌, అశ్విన్‌, హార్దిక్ పాండ్యా ఇలా అందరినీ ప్రశ్నలతో ముంచెత్తాడు. అస‌లు అత‌ను అడిగిన తొలి ప్ర‌శ్న ఏంటో తెలుసా? మీ పేరేంటో నాకు తెలుసు.. మిమ్మ‌ల్ని నేను గుర్తు ప‌డ‌తాను.. కానీ నేను ఎవ‌రో తెలుసా? అని ప్ర‌తి ఒక్క‌రినీ అడిగాడు.

virender sehwags son aryaveer had fun with team india

అయితే ఏ ఒక్కరూ అత‌న్ని గుర్తు ప‌ట్టలేకపోవడం విశేషం. ఇంత‌కీ ఆ బుడ‌త‌డు ఎవ‌రో మీకు తెలుసా? ఒక‌ప్ప‌టి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు. భారత జట్టు ఆటగాళ్లను ఇంట‌ర్వ్యూ చేసిన ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన వీడియోని స్టార్‌స్పోర్ట్స్ ఆదివారం రోజు ప్ర‌సారం చేసింది.

ఈ వీడియోలో వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ప‌దేళ్ల ఆర్య‌వీర్ టీమిండియాను ఆట‌ప‌ట్టించాడు. 'మా నాన్న బ‌డే న‌వాబ్ అయితే నేను చోటే న‌వాబ్' అంటూ ఈ వీడియో చివ‌ర్లో అత‌ను చెప్పడం అభిమానులను ఎంతగానో అలరించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Team India virender sehwags son aryaveer had fun with team india.
Please Wait while comments are loading...