ఐపీఎల్: 'ఈ అవార్డును నా పేరంట్స్‌కి అంకితమిస్తున్నా'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో క్వాలిఫయిర్-1లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించి రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ఫైనల్స్‌‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పూణె బౌలర్ వాషింగ్టన్ సుందర్‌కి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ మ్యాచ్ విజయంలో మనోజ్ తివారి (58), రహానే (56), అర్ధ సెంచరీలతో చెలరేగినప్పటికీ, తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆదిలోనే గట్టి దెబ్బతీశాడు వాషింగ్టన్ సుందర్. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సుందర్‌ 16పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ సందర్భంగా సుందర్ మీడియాతో మాట్లాడాడు.

Washington Sundar dedicates award to his Parents

'బలమైన జట్టుపై అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయంతో ఐపీఎల్‌ ఫైనల్లో చోటు దక్కించుకున్నాం. భారీ సంఖ్యలో హాజరైన అభిమానుల మధ్య ఇలాంటి విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డును నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాను' అని అన్నాడు.

ఈ మ్యాచ్‌లో సీనియర్ క్రికెటర్ల నుంచి తనకు ఎంతో మద్దతు లభించిందని చెప్పాడు. ముఖ్యంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ధోనీ నుంచి అందుకున్న సలహాలు చాలా విలువైనవిగా పేర్కొన్నాడు. ఫైనల్స్‌లో కూడా ఇలాంటి ప్రదర్శన చేస్తే ఐపీఎల్‌ విజేతగా పూణె నిలుస్తుందని సుందర్ తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Washington Sundar stars in Rising Pune Supergiant 20-runs victory over Mumbai Indians in the first Qualifier of IPL 2017 on Tuesday. He took 3 crucial wickets and was adjudged as Player of the match.
Please Wait while comments are loading...