క్రికెట్‌లో వింత: బంతి వికెట్లను తాకినా బెయిల్ పడలేదు (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కరేబియన్‌ సూపర్‌ లీగ్‌ టీ20లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. టోర్నీలో భాగంగా ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌, సెయింట్‌ లూసియా జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఓ ఆశ్చర్యకరమైన సన్నివేశం చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 120 పరుగులు చేసింది. అనంతరం 121 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. ఇన్నింగ్స్ 7వ ఓవర్లో స్పిన్నర్‌ క్యారీ పెర్రీ వేసిన బంతిని ఆండ్రూ ఫ్లెచర్‌ ఎదుర్కొన్నాడు.

WATCH: Ball hits stumps, reaches boundary but bails refuse to fall in CPL 2017

ఆ బంతి బ్యాట్‌ని తాకకుండానే నేరుగా వెళ్లి వికెట్లను తగలడంతో పాటు బౌండరీ లైన్‌ వరకు వెళ్లింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బంతి వికెట్లను తాకినా బెయిల్స్ మాత్రం కింద పడలేదు. దీంతో ఆండ్రూ ఫ్లెచర్‌ నాటౌట్‌గా నిలిచాడు.

ఆ నాలుగు పరుగులను అంపైర్‌ లెగ్‌ బైస్‌గా ప్రకటించాడు. బంతి తాకి వికెట్లకు అమర్చిన లైట్లు వెలిగినప్పటికీ బెయిల్స్‌ కింద పడకపోవడంతో మ్యాచ్ ఆడుతున్న క్రికెటర్లతో పాటు మ్యాచ్ చూస్తున్న అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ మ్యాచ్‌లో నైట్‌ రైడర్స్‌ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియోని కరేబియన్‌ సూపర్‌ లీగ్‌ నిర్వాహకులు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సంక్షిప్త స్కోర్లు:

ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌: 120 for 6 (Shadab 30*, Searles 27*, Shillingford 4-22)
సెయింట్‌ లూసియా: 118 for 9 (Fletcher 40, Sammy 25, Cooper 3-21) by four wicket

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
One of the most bizarre incidents took place in the Caribbean Premier League 2017 encounter between Trinbago Knight Riders and St Lucia Stars after the ball went to reach the boundary despite hitting stumps as the bails didn't fall off.
Please Wait while comments are loading...