అభిమానులకు ఛాలెంజ్: డ్యాన్స్‌తో అదరగొట్టిన క్రిస్ గేల్ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇటీవలే వెస్టిండిస్ టీ20 జట్టులో తిరిగి చోటు దక్కించుకున్న విండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరాడు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన ర‌యీస్ సినిమాలోని లైలా మై లైలా పాట‌కు గేల్ అద్భుతమైన డ్యాన్స్ చేశాడు.

అంతేకాదు ఇదే పాట‌కు త‌న‌ను ఇంప్రెస్ చేసే స్టెప్పులేసిన వారికి 5 వేల డాల‌ర్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు. #ChrisGayleDanceChallenge పేరిట శ‌నివారం ఇన్‌స్టాగ్రామ్‌లో క్రిస్ గేల్ ఓ వీడియోని పోస్టు చేసి అభిమానులకు ఛాలెంజ్ విసిరాడు.

త‌న‌కు వ‌చ్చిన వీడియోలలో అత్యుత్తమ 5 వీడియోలను త‌న పేజ్‌లో షేర్ చేస్తాన‌ని, అందులో బెస్ట్ వీడియోకు అభిమానులే ఓటేయాల‌ని కోరాడు. త‌న కూడా ఈ పాట‌కు అదిరిపోయే స్టెప్పులేశాడు. ఆ వీడియో మీకోసం...

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hard-hitting West Indies opener Chris Gayle, who made a return to the Windies squad, showcased his dancing skills, and started #ChrisGayleDanceChallenge for fans. Gayle, known for power-hitting and flamboyant lifestyle, shared a video post on Instagram on Saturday.
Please Wait while comments are loading...