న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలో నవ్వులు పూయించిన బెయిల్స్ (వీడియో)

క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలను మనల్ని ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. 
 తాజాగా, ఆస్ట్రేలియాలో జరిగిన ఓ దేశవాళీ మ్యాచ్‌లో వికెట్ల‌పై నుంచి ఎగిరి పడిన బ

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలను మనల్ని ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా, ఆస్ట్రేలియాలో జరిగిన ఓ దేశవాళీ మ్యాచ్‌లో వికెట్ల‌పై నుంచి ఎగిరి పడిన బెయిల్స్ మైదానంలో నవ్వులు పూయించాయి.

ఆస్ట్రేలియాలోని సన్‌షైన్ కోస్ట్‌లో హార్డింగ్-మాడ్సన్ షీల్డ్ టోర్నీలో భాగంగా ఆదివారం కయోలండర్, టూవొబాబా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బౌలర్ డామిన్ స్మిత్ విసిరిన బంతి లెగ్‌స్టంప్‌ని వేగంగా తాకుతూ వెనక్కి వెళ్లింది. దీంతో ఆ స్టంప్‌పై ఉన్న బెయిల్ ఎగిరి కింద పడింది.

ఆఫ్‌స్టంప్‌‌ని ఆధారం చేసుకుని ఉన్న మరో బెయిల్ మాత్రం మిడిల్ వికెట్‌పై పడి అలానే గిర్రుని తిరుగుతూ ఉండిపోయింది. సాధారణంగా బంతి తాకగానే బెయిల్స్ కింద పడతాయి లేదంటే, అలానే కొంచెం ఊగి మళ్లీ అదే స్థానంలోనే ఉంటాయి.

కానీ, ఇక్కడ బెయిల్ ఎగిరి పక్కనే ఉన్న స్టంప్‌పై నిల్చోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో మైదానంలో ఉన్న అంపైర్‌ కూడా అక్కడ ఏం జరిగిందో? కాసేపు అర్థం కాన్నట్లు అలానే చూస్తూ నిల్చొండిపోయాడు.

అయితే వికెట్ కీపర్‌తో పాటు ఫీల్డింగ్ చేసిన జట్టులోని ఆటగాళ్లు మాత్రం రిప్లైలో బెయిల్ అలా గిర్రున తిరగడాన్ని చూస్తూ తెగ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X