ఢిల్లీ దెల్లీగా, చెన్నై కాస్త టెన్నై అయింది: ధోని కూతురి వీడియో వైరల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ముద్దులొలుకుతూ మాటలు పలుకుతున్న తన కూతురి వీడియోను టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి త‌న ఇన్‌స్ట్రాగ్రాంలో పోస్టు చేసింది. ఈ వీడియోలో సాక్షి నగరాల పేర్లు పలుకుతుంటే వాటిని జీవా అనుసరిస్తూ ఉంటుంది. ఎలా అంటే సాక్షి ఢిల్లీ అని అంటే జీవా దెల్లీ అని చెబుతోంది.

Learning things !!

A post shared by Sakshi (@sakshisingh_r) on Mar 16, 2017 at 1:18am PDT

కోల్‌కతాని కోల్‌కట్టా అని చెన్నైని టెన్నై అని హైదరాబాద్‌ని హైద్రాబాద్ అని ప‌లుకుతోంది. దీనికి సంబంధించిన వీడియోని ధోని భార్య సాక్షి క్రికెట్ అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాక్షి పలికించిన పేర్లన్నీ కూడా ఐపీఎల్‌లో పాల్గొనే జట్ల పేర్లే కావడం విశేషం.

Watch: MS Dhoni's daughter learns Indian Premier League team names in adorable video

అయితే తండ్రి ధోని ప్రాతనిథ్యం వహిస్తున్న పూణె పేరు లేదు. కాగా ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో ఐపీఎల్‌-10 ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఉప్పల్‌‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఆ తర్వాత డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahendra Singh Dhoni is a doting father and from time to time he posts videos on social media with his daughter, Ziva. In a recent post on his Instagram account, Ziva is seen learning the names of all the eight teams in the Indian Premier League.
Please Wait while comments are loading...