పదేళ్ల ఐపీఎల్: ధోని అలా అవుటవడం ఇదే తొలిసారి (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అనూహ్యంగా రనౌట్ అయి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరిగెత్తే ఆటగాళ్లలో ధోని ఒకడు. అలాంటిది ధోని శుక్రవారం నాటి మ్యాచ్‌లో రనౌట్ కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు  | ఐపీఎల్ పాయింట్ల పట్టిక  | ఐపీఎల్ 2017 ఫోటోలు 

నిజానికి బంతి గమనాన్ని అంచనా వేయడం, వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడంలో ధోనిని మించిన వారు లేరు. గతంలో చాలా సార్లు ఇది నిరూపితమైంది. కానీ.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ధోని పొరపాటున రనౌట్ కావడంతో పుణె మ్యాచ్‌నే చేజార్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె 15.4 ఓవర్లు ముగిసే సరికే 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులతో విజయం లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో బెన్‌స్టోక్స్ అవుట్ కావడంతో ధోని క్రీజులోకి వచ్చాడు.

WATCH: MS Dhoni's uncharacteristic run out

దీంతో మ్యాచ్‌ని అలవోకగా ధోని ముగించేస్తాడని అభిమానులు అందరూ ఆశించారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన కమిన్స్ బౌలింగ్‌లో బంతిని ఫైన్‌లెగ్ దిశగా ధోని ఆడాడు. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మనోజ్ తివారీ పరుగు కోసం పిలవడంతో అలవోకగా పరుగు పూర్తి చేయచ్చనే ఉద్దేశంతో ధోని పరిగెత్తాడు.

అయితే అప్పటికే బంతి అందుకున్న షమీ కీపర్‌కి బంతిని విసిరేలా కనిపించాడు. ఈ దశలో ధోని నెమ్మదిగా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌వైపు వెళ్లడాన్ని గమనించిన షమీ అనూహ్యంగా అటువైపు బంతి విసిరేందుకు సిద్ధమయ్యాడు. దీంతో రనౌట్ ప్రమాదాన్ని పసిగట్టిన ధోనీ పరుగు వేగాన్ని పెంచినా.. అప్పటికే బంతి నేరుగా వికెట్లను తాకింది.

ఐపీఎల్, మ్యాచ్ 52: కీలక మ్యాచ్‌లో పూణెపై గెలిచిన ఢిల్లీ

పదేళ్ల తన ఐపీఎల్ కెరీర్‌లో ధోని మొట్టమొదటిసారి రనౌట్‌గా వెనుదిరిగాడు. ధోని నిష్క్రమణతో పూణెపై ఒత్తిడి పెరిగి చివరికి 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం 'ధోనీ అలవోకగా మ్యాచ్‌ని మార్చేయగలడు. వికెట్ల మధ్య అతను వేగంగా పరుగు తీస్తాడు. ఈ రనౌట్‌ కూడా 50-50 ఛాన్స్ అనుకుంటూ బంతి విసిరా. ఫలితం మాకు అనుకూలంగా వచ్చి మ్యాచ్ మలుపు తిరిగింది' అని షమీ ఆనందం వ్యక్తం చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MS Dhoni is known for being one of the fittest players around, marked by his incredible running between the wickets. However, that’s exactly what made his run out last night so uncharacteristic. Not only was Dhoni slow off the mark, he also wasn’t anticipating the throw at his end.
Please Wait while comments are loading...