వరల్డ్ క్రికెట్‌లోనే అత్యుత్తమ రనౌట్లలో ఇదొకటి (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుత ప్రదర్శన చేస్తోంది. లంక పర్యటనలో ఇప్పటికే ఐదు వన్డేల సిరిస్‌ను 3-2 తేడాతో గెలుచుకున్న జింబాబ్వే... శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆధిక్యాన్ని సాధించింది.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ దిల్‌రువాన్ పెరీరాను జింబాబ్వే ఫీల్డ‌ర్లు ర‌నౌట్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. క్రికెట్ విశ్లేషకులు సైతం ఈ రనౌట్‌ని అత్యుత్తమ రనౌట్లలో ఒకటిగా అభివర్ణిస్తున్నారు.

రెండో రోజు శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బ్యాట్స్‌మెన్ దిల్‌రువాన్ పెరీరా ఆడిన షాట్‌ని బ్యాక్‌వ‌ర్డ్ పాయింట్‌లో ఉన్న త‌రిసాయ్ ముస‌కందా క‌ళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆపడంతో పాటు ఆ బంతిని ప‌క్క‌నే ఉన్న మాల్క్ వాలెర్‌కు అందివ్వ‌డం, అత‌ను వికెట్ కీప‌ర్‌కు త్రో చేయ‌డంతో పెరీరా రనౌట‌్‌గా వెనుదిరిగాడు.

తాజా రనౌట్‌తో ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక రనౌట్లు అయిన జట్టుగా శ్రీలంక నిలిచింది. శ్రీలంక 36 మ్యాచ్‌ల్లో 17 రనౌట్లతో అగ్రస్ధానంలో నిలిచింది. ఇక జింబాబ్వే 9 మ్యాచ్‌ల్లో రనౌట్లు ఏమీ అవకుండా ఉన్న జట్టుగా నిలిచింది.

ఇదిలా ఉంటే కొలంబొ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో తన తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 356 పరుగులు చేయగా, శ్రీలంక‌ను 346 ప‌రుగుల‌కే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ప‌ది పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 23 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ద‌శ‌లో జింబాబ్వేను ర‌జా, మూర్‌, వాలెర్ ఆదుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sri Lanka's Dilruwan Perera became victim of one of the most brilliantly executed run-outs after Zimbabwe's debutant Tarisai Musakanda and Malcolm Waller combined to send the Lankan batsman packing.
Please Wait while comments are loading...