సూపర్ మ్యాన్‌లా: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మైదానంలో ఫీల్డింగ్ చేసేటప్పుడు ఫీల్డర్లు చక్కని డైవ్‌లతో క్యాచ్‌లు పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో నమ్మశక్యం కాని రీతిలో పరిగెత్తతూ క్యాచ్‌ని అందుకుంటుంటారు. మైదానంలో చిరుతలా పరిగెత్తి క్యాచ్‌లను అందుకోవడంలో జాంటీ రోడ్స్, మహ్మద్ కైఫ్, రవీంద్ర జడేజాలు సుప్రసిద్ధులు.

వారి క్యాచ్‌లు అభిమానులను ఎంతగానో అలరించాయి. అయితే వీరందరిని మించిన క్యాచ్‌ని అందుకున్నాడు ఫాబియన్ అలెన్ అనే క్రికెటర్. గాల్లోకి కొట్టిన బంతిని అద్భుతమైన రీతిలో ఎగిరి అందుకుని సుమారు 10 అడుగుల దూరానికి పైగా గాల్లోనే విన్యాసం చేశాడు.

ఈ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ20 పోటీల్లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్, గయానా అమేజాన్ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో సబ్ స్టిట్యూట్‌గా వచ్చిన ఫాబియన్ అలెన్ ఈ క్యాచ్‌ని పట్టుకున్నాడు.

ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, క్రికెట్ చరిత్రలో అద్భుతమైన క్యాచ్‌గా మిగిలిపోతుందని విశ్లేషకులు అంటుంటే, తాము చూసిన అద్భుత క్యాచ్ ఇదేనని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Guyana Amazon Warriors lost three wickets in the last over to suffer a demoralizing four run loss to the St Kitts and Nevis Patriots in the Hero Caribbean Premier League on Sunday at Lauderdale.
Please Wait while comments are loading...