హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుకరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి వన్డేలో స్మిత్‌ను కోహ్లీ అనుకరిస్తుంటే దానిని కెమెరాలు క్లిక్ మనిపించాయి.
అసలేం జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హార్ధిక్ పాండ్యా (83) మెరుపు ఇన్నింగ్స్ తర్వాత భువనేశ్వర్ కుమార్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించడంతో స్మిత్ రివ్యూ కోరాడు.
అయితే రీప్లేల్లో ఇన్సైడ్ ఎడ్జ్ అని స్పష్టంగా తేలడంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో విరాట్ కోహ్లీ అచ్చం స్మిత్లాగా చేయడం కెమెరా కంటికి చిక్కింది. స్మిత్‌లాగే భుజాలను ఎగరేస్తూ అవుట్ అని విరాట్ కోహ్లీ వేలెత్తి చూపడం స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
— Rohit (@rohitpandeyee) September 17, 2017
ఇదిలా ఉంటే ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించడంతో ఈ సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరిస్‌లో రెండో వన్డే గురువారం (సెప్టెంబర్ 21) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.