ధోని వద్దన్నాడు: వెంటనే నిర్ణయం మార్చుకున్న స్మిత్ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో భాగంగా మంగళవారం ముంబైతో జరిగిన క్వాలిఫెయర్-1 మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ ఘనవిజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం పూణె నిర్దేశించిన 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఛేజింగ్ చేస్తుండగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

WATCH: When RPS skipper Steve Smith changed his decision in IPL 2017, Qualifier 1 on MS Dhoni's suggestion

మ్యాచ్‌లో భాగంగా కెప్టెన్ స్మిత్ తాను తొలుత తీసుకున్న నిర్ణయాన్ని ధోని సూచన మేరకు వెంటనే మార్చుకున్నాడు. 8వ ఓవర్ ముగిసే వాషింగ్టన్ సుందర్ 3 ఓవర్లు వేసి రోహిత్ శర్మ(1), అంబటి రాయుడు(0), కీరన్ పొలార్డ్(7) వికెట్లు తీశాడు.

దీంతో పదో ఓవర్‌‌ను కూడా సుందర్‌చే వేయించాలని స్మిత్ నిర్ణయించుకున్నాడు. ఈ లోపు ధోని కలగజేసుకుని సుందర్‌‌ను బౌలింగ్‌కు వద్దని, ఆడమ్ జంపాకు బౌలింగ్ ఇవ్వమని సూచించాడు. ధోని ఇచ్చిన సలహాను స్మిత్ వెంటనే పాటించాడు.

ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ చేత స్మిత్ 13వ ఓవర్ వేయించాడు. ఈ ఓవర్‌లో స్మిత్ నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై ఆల్‌రౌండర్ క్రునాల్ పాండ్యాను అవుట్ చేసే అవకాశాన్ని తృటిలో మిస్సయ్యాడు.

ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లకు 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి పూణ విజయంలో కీలకపాత్ర పోషించిన వాషింగ్టన్ సుందర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
When Rising Pune Supergiant (RPS) replaced MS Dhoni as the skipper of the team with Steve Smith ahead of the tenth edition of the Indian Premier League (IPL), many believed the move would backfire as Dhoni had always played in the IPL as a captain.
Please Wait while comments are loading...