అదే జట్టు: కోహ్లీసేనను ఢీకొట్టే వెస్టిండీస్‌ జట్టు ఇదే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా జూన్ 23 నుంచి వెస్టిండిస్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో టీమిండియా... ఆతిథ్య వెస్టిండిస్ జట్టుతో ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. దీంతో వెస్టిండిస్ పర్యటనకు వెళ్లే భారత జట్టుని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.

రోహిత్, బుమ్రా అవుట్: వెస్టిండిస్ పర్యటనకు వెళ్లే భారత జట్టు ఇదే

ఈ పర్యటనకు యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు కల్పించి, ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ టోర్నీలో ఆడుతున్న జస్ప్రీత్ బుమ్లా, రోహిత్ శర్మలకు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం టీమిండియా అటు నుంచి అటే వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరింది.

jasonholder

ఇదిలా ఉంటే క్రికెట్‌ వెస్టిండీస్‌ బోర్డు కూడా టీమిండియాతో తొలి రెండు వన్డేలు ఆడే జట్టును ప్రకటించింది. ఆప్ఘనిస్థాన్‌తో ఇటీవలే ముగిసిన రెండు వన్డేల్లో ఆడిన జట్టునే ప్రకటించడం విశేషం. ఆప్ఘన్‌తో ఆడిన రెండు వన్డేల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో డ్రా అయింది.

13 మంది సభ్యుల గల జట్టుకి జాసన్‌ హోల్డర్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. జూన్‌ 23న పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ మైదానంలో భారత్-విండిస్ తొలి వన్డే జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

భారత్‌తో తొలి రెండు వన్డేలకు వెస్టిండిస్‌ జట్టు:

జాసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), దేవేంద్ర బిషు, జొనాథన్‌ కార్టర్‌, రాస్టన్‌ ఛేజ్‌, మిగుల్‌ కమిన్స్‌, షాయ్‌ హోప్‌(వికెట్‌కీపర్‌), అల్జారీ జోసఫ్‌, ఎవిన్‌ లూవిస్‌, జాసన్‌ మహ్మద్‌, ఆష్టే నర్స్‌, కీరన్‌ పోవెల్‌, రోవ్‌మన్‌ పోవెల్‌, కెస్రిక్‌ విలియమ్స్‌.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The West Indies have named an unchanged 13-member squad, which played against Afghanistan, for the first two ODIs against India.
Please Wait while comments are loading...