న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా కోచ్ పదవిపై రాహుల్ ఏమన్నాడు?

న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్ కోచ్‌గా ఉండాలంటే పూర్తిస్థాయిలో అందుకు సమయం కేటాయించాల్సి వస్తుందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ).. టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను ఎంపిక చేసేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

ఐసిసి ప్రపంచ టీ20 టోర్నీతోనే టీమిండియా డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి పదవీ కాలం పూర్తవడంతో టీమిండియా కోచ్ వేట మొదలైంది. కాగా, కోచ్ బాధ్యతలకు రాహుల్ ద్రావిడ్ పూర్తి న్యాయం చేయగలడని బిసిసిఐ భావిస్తోంది. రాహుల్ ద్రావిడ్ మాత్రం ఇప్పటి వరకు నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

టీమిండియా కోచ్ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న ప్రశ్నకు రాహుల్ బదిలిస్తూ.. 'అది పెద్ద బాధ్యత అని. అందుకు చాలా సమయం అవసరం ఉంటుంది. ఇవన్ని నేను చేయగలనా?' అనే సందేహం వ్యక్తం చేశాడు.

What did Rahul Dravid say about coaching Team India?

43ఏళ్ల ద్రావిడ్ ప్రస్తుతం ఇండియా ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతేగాక, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు మెంటర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.

'ఇది కొంత సమయం తీసుకుంటుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేదా? అదొక అనుభవం నేర్పుతుంది. తెలిసినప్పుడే ఏదైనా చేయగల్గుతాం. ప్రతీరోజు చేస్తుంటే నేర్చుకోవచ్చు' అని తెలిపాడు. ఏ నిర్ణయమైన చాలా పరిశీలించి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. చేయాలని ఉన్నప్పటికీ సమయం, శక్తి సరిపోతుందా? లేదా? అనేది బేరీజు వేసుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. 100శాతం నమ్మకం ఉన్నప్పుడే ఆ పాత్ర సిద్ధమవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

ఇండియా కోచ్‌గా ఉన్నప్పుడు ఫలితాలు వచ్చాయా? లేదా? అన్నది కాకుండా పూర్తి నిబద్ధతతో పని చేయాల్సి ఉంటుందని చెప్పాడు. 'నేను మంచి బ్యాట్స్‌మన్ కావాలనుకుంటే.. అందుకు కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. కోచింగ్ అనేది ఎప్పుడూ నేర్పుతూ, నేర్చుకునే విషయం'అని చెప్పాడు.

'ఈ పదవికి నేను కొంచెం కొత్తే. ఆటగాడిగా కంటే కూడా ఎక్కువగా ఆలోచించాలి. కెప్టెన్‌గా సమయంలో అవసరమైన ప్రణాళికలు వేసుకున్నాం. అయితే, కోచ్ పదవి దానికి భిన్నం. తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దాల్సి ఉంటుంది' అని చెప్పాడు. అండర్-19 జట్టు జూనియర్ ప్రపంచ కప్ టోర్నీలో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైన విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు.

'ఫలితాలను మర్చిపోయి చేయాల్సిన దాని గురించి భిన్నంగా ఆలోచించాలి. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆటగాళ్లంతా సిద్ధమయ్యారు. అయితే, ప్రత్యర్థి జట్టు మరో ప్రయత్నంతో ముందుకు వచ్చింది. దీంతో 46 ఓవర్లు మీడియా పేస్ వేసి విండీస్ జట్టు గెలుపొందింది' అని ద్రావిడ్ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X