సెమీఫైనల్: టీమ్ అంతా ప్రాక్టీస్, కానీ ధోని మాత్రం స్పెషల్?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యనటలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో క్రికెటర్లు ఏ మాత్రం ఖాళీ దొరికినా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి బంగ్లాదేశ్‌తో సెమీస్ పోరుకు టీమిండియా సిద్ధమైంది. జూన్ 15(గురువారం) ఎడ్జిబాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కీలకమైన మ్యాచ్‌ కావడంతో జట్టు సభ్యులంతా ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

అయితే ధోని మాత్రం ఈ మ్యాచ్‌కు దొరికిన విరామంలో తన భార్య సాక్షి, కుమార్తె జివాతో కలిసి ఎంజాయ్‌ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను భారత క్రికెట్ జట్టు తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. భార్య సాక్షి, కూతురు జివాతో కలిసి ధోనీ షికారుకెళ్లినప్పటి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

@mahi7781 with his better half @sakshisingh_r and little Ziva #TeamIndia #CT17

A post shared by Team India (@indiancricketteam) on Jun 13, 2017 at 5:47am PDT

'టీమిండియా మాజీ కెప్టెన్ ధోని తన భార్య సాక్షి, కుమార్తె జీవాలతో' అంటూ కామెంట్ పెట్టింది. ఈ ఫోటోలో ధోని తన ముద్దుల కుమార్తెని ఎత్తుకోగా, పక్కనే భార్య సాక్షి ఉంది. ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలగిన తర్వాత ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నాడు.

కాగా, జూన్ 9న ధోని తన భార్య సాక్షి 'ఫ్యామిలీ టైమ్‌' అంటూ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన ధోని విదేశీ గడ్డపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్ మెన్‌గా రికార్డు సృష్టించాడు.

Family time !

A post shared by Sakshi (@sakshisingh_r) on Jun 9, 2017 at 9:11am PDT

ఇప్పటి వరకు ఈ రికార్డు మాజీ కెప్టెన్ గంగూలీ పేరిట ఉండేది. కాగా, 49.2వ ఓవర్లో చండీమాల్‌ బౌలింగ్‌లో ధోనీ అవుటైన సంగతి తెలిసిందే. 296 మ్యాచ్‌లాడిన గంగూలీ 159 సిక్సర్లు బాదగా, 281 మ్యాచ్‌ల్లోనే ధోని 161 సిక్స్‌లతో ఆ రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్ అఫ్రిది 402 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahendra Singh Dhoni is enjoying his time with his family ahead of the big semi-final against Bangladesh in the ICC Champions Trophy 2017.
Please Wait while comments are loading...