న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొత్తం తినేశారు: మొదటి చైనీస్ పుడ్ అనుభవంపై సచిన్ ఇలా

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మంచి భోజన ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. ఇంట్లో తయారు చేసిన అమ్మ వంటకాలను ఎంతో ఇష్టంగా తింటాడు. 
 అయితే తన స్నేహితుల వల్ల తన మొదటి చైనీస్ పుడ్ అనుభవం ఎంతో నిరాశను కలిగ

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మంచి భోజన ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. ఇంట్లో తయారు చేసిన అమ్మ వంటకాలను ఎంతో ఇష్టంగా తింటాడు. అయితే తన స్నేహితుల వల్ల తన మొదటి చైనీస్ పుడ్ అనుభవం ఎంతో నిరాశను కలిగించిందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు.

1980ల కాలంలో ముంబైలో చైనీస్‌ ఫుడ్‌కు అప్పుడప్పుడే ఆదరణ పెరుగుతోంది. దీంతో చైనీస్ పుడ్‌ని రుచి చూడాలనే ఉద్దేశ్యంతో కాలనీ స్నేహితులంతా కలిసి.. ఒక్కొక్కరు రూ.10 వేసుకొని చైనీస్ రెస్టారెంట్‌కు వెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు. అయితే తాను చిన్నవాడు అవడంతో ఒక్కో ఐటమ్‌ నాకు రెండు చెంచాలు మాత్రమే లభించిందని అన్నాడు.

When friends spoiled Sachin's first Chinese food experience!

సచిన్‌ ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్‌ ఇట్‌ మై వే' ను బాలలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో సచిన్ టెండూల్కర్ ప్రధాన పాత్రలో ఓ కామిక్‌ క్యారెక్టర్‌కు సృష్టించారు. 'ప్లేయింగ్ ఇట్ మై వే' ద్వారా తన జీవిత రహస్యాలను వెల్లడించిన సచిన్ పుస్తకంలోని కొన్ని భాగాలను తీసుకుని కామిక్ బుక్‌గా రూపొందించారు.

ఈ పుస్తకాన్ని ప్రముఖ పబ్లిషర్స్ హచ్చాటే ఇండియా 'ఛేజ్‌ యువర్‌ డ్రీమ్స్‌' పేరిట ఓ బుక్‌ను తీసుకువచ్చింది. ఆ పుస్తకం 486 పేజీలుంటే దానిలో సగం పేజీలతో సచిన్ క్రికెట్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కామిక్ బుక్‌ను రూపొందించినట్టు హాచెట్ ఇండియా పేర్కొంది.

ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో సచిన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 'అప్పట్లో పది రూపాయలంటే ఎక్కువే. కొత్త రకం ఆహారాన్ని ఆస్వాధించాలని నాలో ఉత్సాహం పెరిగింది. మేమంతా కలిసి రెస్టారెంట్‌కు వెళ్లాం. అయితే స్నేహితులందరిలో నేనే చిన్నవాడిని. అదే నా దురదృష్టం. చికెన్‌, స్వీట్‌కార్న్‌ సూప్‌ను మొదటగా ఆర్డర్‌ చేశాం' అని సచిన్ చెప్పాడు.

'మేమంతా కలిసి ఓ పొడవాటి టేబులు చుట్టూ కుర్చున్నాం. అయితే చివర్లో నేను ఉన్నాను. ఆ కారణంగా నా వరకూ వచ్చే సరికి ఐటమ్స్‌లలో పెద్దగా ఏమీ మిగలలేదు. మిగతావారే ఎక్కువగా లాగించేశారు. నేను చిన్నవాడినైన కారణంగా నాకు తక్కువ మిగిల్చేవారు. ఆ తర్వాత ఆర్డర్‌ చేసిన ఫ్రైడ్‌ రైస్‌, ఇతర ఐటమ్స్‌ల విషయంలో కూడా ఇలాగే జరిగింది' అని సచిన్ తెలిపాడు.

'ఒక్కో ఐటమ్‌ నాకు రెండు చెంచాలు మాత్రమే లభించింది. ఈ కారణంగా నేను ఇంటికి ఆకలితోనే తిరిగివచ్చాను. మా డబ్బుతో వారంతా ఎంజాయ్‌ చేశారని అనిపించింది' అని తన తొలి చైనీస్ పుడ్ అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ పుస్తకంలో సచిన్ కోసం అతడి తల్లి చేపలు, రొయ్యల కూర లాంటి ఇష్టమైన వంటకాలను చేసి పెట్టేదని తెలిపారు.

1998లో ఎడారి ఇసుక తుఫాను వచ్చిన రోజే షార్జాలో సచిన్ ఆడిన గ్రేట్ ఇన్నింగ్స్ వంటి ప్రధాన ఈవెంట్లను పుస్తకంలో పొందుపరిచినట్టు తెలుస్తోంది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X