భార్యతో మ్యూనిచ్‌లో రోహిత్ శర్మ: పక్కనే కేఎల్ రాహుల్

Posted By:
Subscribe to Oneindia Telugu
హైదరాబాద్: తొడ కండరాల గాయం కారణంగా లండన్‌లో సర్జరీ చేయించుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ గత కొంత కాలంగా టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు లభించిన సమయాన్ని తెగ ఆస్వాదిస్తున్నాడు.

భార్య రితికాతో కలిసి మ్యూనిచ్ వెళ్లిన రోహిత్ శర్మ

ఇందులో భాగంగా ప్రస్తుతం తన భార్య రితికాతో కలిసి మ్యూనిచ్ వెళ్లాడు. యూఇఎఫ్ఏ ఛాంపియన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో మ్యూనిచ్, ఆర్సెనల్ జట్ల మధ్య మ్యాచ్‌ను వీరిద్దరూ వీక్షించారు. ఈ మ్యాచ్‌కి హాజరయ్యేందుకు కొనుగోలు చేసిన టికెట్లను రోహిత్ శర్మ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

అభిమానుల కోసం ట్విట్టర్‌లో ఫోటోలు


అనంతరం మ్యాచ్‌ని వీక్షించిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో అభిమానుల కోసం ఉంచాడు. అయితే వీరితో పాటు మరో భారత జట్టు ఆటగాడు కెఎల్ రాహుల్ ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో మ్యూనిచ్ జట్టు 5-1 తేడాతో గెలుపొందింది.

పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రయత్నాలు


గతేడాది న్యూజిలాండ్‌ సిరిస్ అనంతరం తొడ కండరాల గాయం కారణంగా రోహిత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. అనంతరం రోహిత్ శర్మకు లండన్‌లో సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో ఆడటానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

టెస్టుల్లో రోహిత్‌కు దక్కిని చోటు

టెస్టుల్లో రోహిత్‌కు దక్కిని చోటు


ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 23 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి రెండు టెస్టులకు కూడా రోహిత్ శర్మ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టులకైనా జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో వేచి చూడాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rohit Sharma, who is currently out of the Indian cricket team, seems to be having a great time off the field. And interestingly it is football that’s keeping him busy, and smiling.
Please Wait while comments are loading...