ఆయన పక్కన పిల్లోడిలా: ది గ్రేట్ ఖలీని కలిసిన కోహ్లీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం ప్రస్తుతం శ్రీలంకలో పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం సాయంత్రం ఓ ప్రత్యేక అతిథిని కలిశాడు. ఆ ప్రత్యేక అతిథి ఎవరంటే డబ్ల్యూడబ్ల్యూఈ భారత రెజ్లింగ్‌ స్టార్‌ ఖలీ.

ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆదివారం ముగిసింది. ఇన్నింగ్స్‌ 53 పరుగుల తేడాతో విజయం సాధించి 2-0తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న కోహ్లీ ఆ తర్వాత జట్టు సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ది గ్రేట్ ఖలీతో దిగిన ఫొటోను విరాట్ కోహ్లీ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వీరి ఫోటోపై నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. 'ఖ‌లీ ప‌క్క‌న నువ్వొక చిన్న పిల్లాడిలా ఉన్నావ్‌, 'నీ టీమ్‌కు ఖ‌లీ అంత పెద్ద బౌల‌ర్ అవ‌స‌రం' అంటూ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఆదివారం శ్రీలంకతో రెండో టెస్టు ముగిసిన అనంతరం ది గ్రేట్ ఖలీని కలిసిన ఫోటోలను కోహ్లీ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'ద గ్రేట్‌ ఖలీని కలవడం ఎంతో ఆనందంగా ఉంది' అని కోహ్లీ పేర్కొన్నాడు. ఖలీ పక్కన కూర్చున్న, నిల్చున్న ఫొటోలను కోహ్లీ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

పంజాబ్‌కు చెందిన ఖలీ భారత ప్రొఫెషనల్‌ రెజ్లర్‌. ఖలీ పూర్తి పేరు దలీప్‌ సింగ్‌ రానా. 7.1 అడుగుల ఎత్తు ఉన్న ఖలీ పక్కన కోహ్లీ చిన్నోడిలా కనిపిస్తున్నాడు. డబ్ల్యూడబ్ల్యూలో ఖలీకి ఎంత ఆదరణ ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Virat Kohli might have fan swooning for him every time he steps out, but the India skipper was mighty pleased on Sunday. Having just won the Test series against Sri Lanka in the Island Nation, he had a special visitor in WWE fighter The Great Khali. Kohli took to social media to share pictures from the meeting on Friendship Day.
Please Wait while comments are loading...