వెళ్లి పాక్‌లో సెలబ్రేట్ చేసుకో: కాశ్మీర్ వేర్పాటువాదికి గంభీర్ సీరియస్ వార్నింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాశ్మీర్ వేర్పాటువాది మిర్వేజ్ ఫ‌రూక్‌ పాకిస్థాన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత ఓటమికి ప్రధాన కారణం

'పాకిస్థాన్ గెలవ‌గానే ఎటు చూసినా ప‌టాకుల మోత‌తో ఈద్ ముందే వ‌చ్చిన‌ట్లుంది.. పాకిస్థాన్ జట్టుకు శుభాకాంక్ష‌లు' అంటూ మిర్వేజ్ ఫ‌రూక్ ట్వీట్ చేశాడు. మిర్వేజ్ ఫ‌రూక్‌పై టీమిండియా ఆటగాడు గౌతం గంభీర్ సీరియస్ అయ్యాడు.

Why don't you go celebrate in Pakistan: Gautam Gambhir to Hurriyat's Mirwaiz Umar Farooq

దీనిపై గౌతం గంభీర్ కాస్త వెట‌కారంగా స్పందించాడు. 'ఫ‌రూక్.. నీకో స‌ల‌హా. మీరు స‌రిహ‌ద్దు క్రాస్ చేస్తే ఇంకా మంచి ప‌టాకులు (చైనీస్‌) దొరుకుతాయి. అక్క‌డే ఈద్ సెల‌బ్రేట్ చేసుకో. ప్యాకింగ్‌లో మీకు నేను సాయం చేస్తా' అని గంభీర్ ట్వీట్ చేశాడు. అంతేకాదు 'పాకిస్థాన్ గెలిస్తే.. వెళ్లి ఆ దేశంలోనే సెల‌బ్రేట్ చేసుకో' అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.

అయితే మిర్వేజ్ ఫ‌రూక్‌ పాకిస్థాన్ జట్టుకు మద్దతుగా ట్వీట్ చేయడం ఇదే తొలిసారి కాదు. సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుని ఓడించిన తర్వాత కూడా ఫ‌రూక్ పాకిస్థాన్ జట్టుపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. దీంతో గంభీర్ ఫ‌రూక్ ట్వీట్లపై తనదైన శైలిలో స్పందించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cricketer Gautam Gambhir has in a tweet asked a Kashmiri separatist to celebrate Pakistan's win in the Champions Trophy+ in Pakistan rather than in Kashmir.
Please Wait while comments are loading...