కోహ్లీని అడిగితే..: వీరేంద్ర సెహ్వాగ్ అందుకే కోచ్ కాలేకపోయాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: భారత కోచ్ పదవి రేసులో వీరేంద్ర సెహ్వాగ్ వెనుకబడటానికి తన సహాయక బృందాన్ని ఎంచుకోవాలనే ఆలోచన చేయడమేనని అంటున్నారు. తనకు అనుకూలంగా ఉండేవారిని తీసుకోవాలనే అతని నిర్ణయమే కోచ్ పదవిని మిస్ చేసిందని అంటున్నారు.

ప్రజెంటేషన్‌తో పడేశాడు: టీమిండియా కొత్త కోచ్‌గా సెహ్వాగ్!

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా చేయడం సెహ్వాగ్‌లో భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేయగలననే విశ్వాసం కలిగింది. బీసీసీఐలోని కొందరు పెద్దల సలహా మేరకు అతడు కెప్టెన్ కోహ్లీ మద్దతు కోరాడు.

 Why Virender Sehwag missed out on coach's job

భారత క్రికెట్‌కు మీరెంతో చేశారని, మా అందరికీ మీరు తెలుసునని, మీరు కోచ్‌ పదవికి దరఖాస్తు చేస్తానంటే మాకెవరికీ అభ్యంతరం లేదని, ఆ పదవికి సరిపోయే ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చునని కోహ్లీ చెప్పాడంటున్నారు.

అయితే, ఫిజియో థెరపిస్టు అమిత్‌ త్యాగి, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహాయ కోచ్‌ మిథున్‌ మన్హాస్‌ను తన సహాయక బృందంలో చేర్చుకుంటానని సెహ్వాగ్‌ ప్రతిపాదించాడు.

మీరు తీసుకొచ్చే ప్రతిపాదనలపై తనకు గౌరవముందని, కానీ వారి ఎంపికకు ఓ ప్రత్యేక ప్రక్రియ ఉందని, సలహా సంఘం ఆ పని చూసుకుంటుందని కోహ్లీ చెప్పాడని తెలుస్తోంది.

Virat Kohli Won And Suspense Ends On Team India Coach Post

చివరికి కలుపుగోలుతనం, ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇచ్చే విషయంలో క్రికెటర్లకు రవిశాస్త్రి నచ్చడంతో సెహ్వాగ్‌ రేసులోంచి వెనక్కి వెళ్లాడని అంటున్నారు. అతడు ఇచ్చిన ప్రజెంటేషన్‌ సైతం రవిశాస్త్రి, టామ్‌ మూడీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలుస్తోంది. అందుకే అతని ఎంపిక జరగలేదంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former India opener Virender Sehwag, a mentor with the Kings XI Punjab franchise in the IPL, had Kohli's complete backing and would've been a front-runner to grab the role if not for certain conditions. Sehwag was one of the five candidates who went for the interview, and according to those in the know of developments, his presentation was the third most impressive after Ravi Shastri and Tom Moody's. However, a lot of groundwork happened between Sehwag and the Team India camp - initiated by the former India opener himself - before it eventually boiled down to the interview in Mumbai which the two-time triple centurion attended in person.
Please Wait while comments are loading...