ఎదురుదెబ్బ: చివరి టెస్టులో కోహ్లీ ఆడటం అనుమానమేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో ఫలితం తేలనున్న ధర్మశాల టెస్టులో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగలనుందా? భుజం గాయంతో బాధపడుతున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ధర్మశాలలో జరిగే చివరి టెస్టు మ్యాచ్‌ ఆడతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

రాంచీ టెస్టు తొలిరోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా కోహ్లీ డైవ్ చేయడంతో కుడి భుజానికి గాయమైంది. దీంతో వెంటనే మైదానాన్ని వీడాడు. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న రహానే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఇక రెండో రోజు కోహ్లీ పూర్తిగా ఆటకు దూరమయ్యాడు. అయితే కోహ్లీ ఆ తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఆశ్చర్యపరిచాడు.

నాలుగో టెస్టులో పాల్గొనడంపై

నాలుగో టెస్టులో పాల్గొనడంపై

అంతేకాదు మైదానంలో చురుగ్గా కనిపించడంతో కోహ్లీ నాలుగో టెస్టులో పాల్గొనడంపై ఎవరికీ సందేహం కలగలేదు. అయితే గురువారం పరిస్థితులు మారిపోయాయి. టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు దూరమైన విరాట్‌ భుజానికి పెద్ద బ్యాండేజీతో మైదానంలో దర్శనమిచ్చాడు.

ప్రాక్టీస్‌ సెషన్‌లో కోహ్లీ బంతులు

ప్రాక్టీస్‌ సెషన్‌లో కోహ్లీ బంతులు

ప్రాక్టీస్‌ సెషన్‌లో కోహ్లీ బంతులు విసురుతూ మాత్రమే కనిపించాడు, బ్యాటింగ్ సాధన చేయలేదు. ఆ తర్వాత ఫిజియోతో సుదీర్ఘంగా చర్చించాడు. భుజంపై ఒత్తిడి పడకుండా ఉండేందుకే అతడు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు దూరమయ్యాడని అనుకున్నారు. అయితే సెలక్టర్లు 22 ఏళ్ల ముంబై ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌ను టెస్టు జట్టులో ఎంపిక చేశారు.

కోహ్లీ గాయంపై అనుమానాలు

కోహ్లీ గాయంపై అనుమానాలు

ఈ పరిణామాలన్నీ కోహ్లీ గాయంపై అనుమానాలను పెంచేశాయి. చివరి టెస్టులో కోహ్లీ ఆడే పరిస్థితి లేకపోతే శ్రేయాస్‌ను ఆడించనున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం కోహ్లీకి ఫిట్‌నెస్‌ పరీక్షను నిర్వహించనున్నారు. అతడు మ్యాచ్‌ ఆడలేని స్థితిలో ఉంటే అయ్యర్‌కు అవకాశం లభించొచ్చు.

శుక్రవారం మధ్యాహ్నం జట్టుతో కలిసే అవకాశం

శుక్రవారం మధ్యాహ్నం జట్టుతో కలిసే అవకాశం

శ్రేయాస్‌ అయ్యర్‌ శుక్రవారం మధ్యాహ్నం జట్టుతో కలిసే అవకాశముంది. కోహ్లీ ఆడనలేని పక్షంలో ముందు జాగ్రత్తగా అయ్యర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ముంబైకి చెందిన ఈ యువ బ్యాట్స్‌మన్‌ ఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. గతేడాది రంజీల్లో అత్యధికంగా 1321 పరుగులు చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
He won't particularly like the analogy, but Indian captain Virat Kohli does have one thing in common with Donald Trump heading into the deciding Test against the Aussies - a fierce will to hang on in trying circumstances.
Please Wait while comments are loading...