పిరికివాడిలా పారిపోను: గంగూలీ వ్యాఖ్యలపై అనురాగ్ ఠాకూర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారత క్రికెట్ తన సేవలు అవసరమని కోరితే అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. గత కొన్ని నెలలుగా భారత క్రికెట్‌కు దూరమైన అనురాగ్ ఠాకూర్ తన రీ ఎంట్రీపై ఆదివారం స్పందించారు.

గంగూలీ పుట్టినరోజు సందర్భంగా అనురాగ్ ఠాకూర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో 'అనురాగ్ మళ్లీ భారత్ క్రికెట్ లోకి రావాలి. అతని అవసరం భారత్ క్రికెట్ కు ఉంది' అని గంగూలీ ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గంగూలీ వ్యాఖ్యలపై ఆయన మాట్లాడారు.

Won't shy away from accepting responsibility, if Indian Cricket requires: Anurag Thakur

గంగూలీ అలా అనడం తనకెంతో గౌరవమని అన్నారు. బాధ్యతల్ని నుంచి తప్పించుకునే మనస్తత్వం కాదని ఆయన తెలిపారు. 'గంగూలీ లాంటి వ్యక్తి అలా అభిలాషించినందుకు సంతోషంగా ఉంది. అయితే ఇప్పటి వర కూ అలాంటి ఆలోచ న లేదు. ఒకవేళ భారత క్రికెట్‌కు నా సేవలు కావాలనుకుం టే ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. అంతేకానీ బాధ్యతలనుంచి పిరికివాడిలా పారిపోను' అని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

Sourav Ganguly says, Zaheer Khan to be contracted for 150 days a year | Oneindia News

కోచ్‌ ఎంపికలో జరిగిన నాటకీయ పరిణామాలపై ఆయన స్పందించడానికి నిరాకరించారు. సుప్రీం కోర్టుకు బేషరతు క్షమాపణలు చెప్పృడంతో ఆయన కోర్టు ఉల్లంఘనల కేసు నుంచి విముక్తులైన సంగతి తెలిసిందే. జస్టిస్ లోధా కమిటీ సంస్కరణల అమల్లో జాప్యం చేయడంతో ఠాకూర్‌ను తొలగించి అతడి స్ధానంలో సీఓఏను నియమించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
He has been away from the hullabaloo of Indian cricket for the last six months but former BCCI president Anurag Thakur says if required, he "won't shy away from accepting responsibility".
Please Wait while comments are loading...