మొహాలీ: భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన ట్వంటీ 20 ప్రపంచ కప్ మ్యాచులో భారత జట్టు ఘన విజయం సాధించింది. స్టార్ బ్యాట్సుమెన్ విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఓ వైపు వికెట్లు పడిపోతుంటే, అతను భారత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు.
ఈ మ్యాచ్ గురించి కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ బ్యాటింగుకు దిగిన 10 ఓవర్లలో వికెట్ల పతనం చూసి మ్యాచ్ పైన ఆశలు వదిలేసుకున్నామని చెప్పాడు. ఎంఎస్ ధోనీ క్రీజులోకి వచ్చేంత వరకు తాను ఎంతో ఒత్తిడికి లోనయ్యానని చెప్పాడు.
ధోనీ క్రీజులోకి రాగానే ఏం జరుగుతుందో, ఎలా మ్యాచ్‌ను గెలవాలో కూడా తనకు అర్థం కాలేదని విరాట్ కోహ్లీ చెప్పాడు. భారత జట్టు కోసం ఆడిన ఆటను గుర్తుకు తెచ్చుకుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. తాను ఒత్తిడిని జయించి ఆడటానికి అభిమానులే కారణమని చెప్పాడు.
సచిన్ టెండుల్కర్ కంటే నేను తక్కువే
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కంటే తన ప్రత్యేకత తక్కువేనని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఆసిస్‌తో మ్యాచ్ అనంతరం చాలామంది కోహ్లీని సచిన్‌తో పోలుస్తున్నారు. దీనిపై కోహ్లీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. థ్యాంక్యూ సచిన్ పాజీ, నీ కంటే నా ప్రత్యేకత తక్కువే అని పేర్కొన్నాడు. అంతకుముందు సచిన్ కోహ్లీకి కితాబిస్తూ ట్వీట్ చేశాడు.
విరాట్ కోహ్లీ అధ్భుతమైన ఇన్నింగ్స్ పైన ఆస్ట్రేలియా మీడియా కూడా ప్రశంసలు కురిపించింది. భారత్ మాజీ క్రికెటర్లు కోహ్లీని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక క్రికెట్ అభిమానులు అయితే విరాట్ కోహ్లీ పైన సోషల్ మీడియాలో కితాబు ఇస్తున్నారు.
ఐసీసీ ట్వంటీ 20 ర్యాంకింగ్స్‌లో కోహ్లీ టాప్
ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం ఐసీసీ ట్వంటీ 20 అంతర్జాతీయ ర్యాంకింగ్సులో కోహ్లీ టాప్‌లో నిలిచాడు. కోహ్లీ 871 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. టాప్ టెన్ బ్యాట్సుమెన్ వీరే..
1. విరాట్ కోహ్లీ - భారత్ (871 పాయింట్లు) 2. ఆరోన్ ఫించ్ - ఆస్ట్రేలియా (803) 3. మార్టిన్ గుఫ్తిల్ - న్యూజిలాండ్ (762) 4. డుప్లెసిస్ - దక్షిణాఫ్రికా (741) 5. అలెక్స్ హేల్స్ - ఇంగ్లాండ్ (737) 6. క్రిస్ గేల్ - వెస్టిడీస్ (724) 7. కేన్ విలియమ్సన్ - న్యూజిలాండ్ (718) 8. మసకద్జ - జింబాబ్వే (677) 9. మొహమ్మద్ షహజాద్ - ఆప్ఘనిస్తాన్ (674) 10. షేన్ వాట్సన్ - ఆస్ట్రేలియా (664)
టాప్ బౌలర్స్...
1. సామ్యూల్ బద్రీ - వెస్టిండీస్ (753 పాయింట్లు) 2. ఇమ్రాన్ తాహిర్ - సౌతాఫ్రికా (740) 3. రవిచంద్రన్ అశ్విన్ - భారత్ (725) 4. షాహిద్ అఫ్రిది - పాకిస్తాన్ (674) 5. అబోట్ - దక్షిణాఫ్రికా (671) 6. అడమ్ మిల్నే - న్యూజిలాండ్ (648) 7. రవీంద్ర జడెజా - భారత్ (645) 8. జేమ్స్ ఫాల్కనర్ - ఆస్ట్రేలియా (641) 9. మొహమ్మద్ నబీ - ఆప్ఘనిస్తాన్ (638) 10. మిచెల్ మెక్లెనగన్ - న్యూజిలాండ్ (638)
టాప్ జట్లు...
1. భారత్ - 127 పాయింట్లు 2. న్యూజిలాండ్ - 122 3. వెస్టిండీస్ - 120 4. దక్షిణాఫ్రికా - 115 5. ఇంగ్లాండ్ -115 6. ఆస్ట్రేలియా - 112 7. పాకిస్తాన్ - 107 8. శ్రీలంక - 105 9. ఆప్ఘనిస్తాన్ - 81 10. బంగ్లాదేశ్ - 74 11. స్కాట్లాండ్ - 59 12. నెదర్లాండ్స్ - 59 13. జింబాబ్వే - 57 14. హాంగ్ కాంగ్ - 44 15. యూఏఈ - 43 16. ఐర్లాండ్ - 39 17. ఒమన్ - 37