న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20: ఒకే గ్రూపులో భారత్, పాక్.. మార్చి 19న మ్యాచ్

By Nageswara Rao

బెంగుళూరు: వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వరల్డ్ టీ20 టోర్నమెంట్‌లో దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూపులో ఉన్నాయి. మార్చి 19న ధర్మశాలలో జరగనున్న మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి.

గ్రూప్ ఏలో... శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా ఉన్నాయి. గ్రూప్ బిలో భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి. మార్చి 11 నుంచి ఏప్ర్లిల్ 3 వరకు టి ట్వంటీ ప్రపంచ కప్ జరగనుంది.

ముంబై, ఢిల్లీలలో సెమీ ఫైనల్, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో ఫైనల్ జరగనుంది. ధర్మశాల వేదికగా 19న భారత్ - పాక్ మ్యాచ్ జరగనుంది. మొహాలిలో 27న ఆస్ట్రేలియాతో భారత్ ఆడనుంది. భారత్ తన తొలి మ్యాచ్ న్యూజిలాండుతో ఆడనుంది.

World T20: India and Pakistan in same group, to face off on March 19

భారత్ ఆడే మ్యాచ్‌ల వివరాలు ఇవి...

మార్చి 15 - భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (నాగపూర్)
మార్చి 19 - భారత్ వర్సెస్ పాకిస్థాన్ (ధర్మశాల)
మార్చి 23 - భారత్ వర్సెస్ ఏ గ్రూప్ క్వాలిఫయర్ (బెంగళూరు)
27 మార్చి - భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (మొహాలి)

మహిళల క్రికెట్ పోటీల్లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే పోరు కూడా శనివారం, మార్చి 19న ధర్మశాలలోనే జరుగుతుంది. ఈ పోటీ డే మ్యాచ్‌గా, ఆపై పురుషుల పోటీ డే/నైట్ మ్యాచ్‌గా సాగుతుంది.

మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్న ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్‌కు సంబంధించిన గ్రూపులు, మ్యాచ్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం (డిసెంబర్ 11)న ప్రకటించింది.

భారత్‌లో తొలిసారిగా జరగనున్న ఈ టోర్నమెంట్ 8 వేదికలలో జరగనుంది. దక్షిణాఫ్రికాలో 2007లో జరిగిన మొట్టమొదటి వరల్డ్ టీ20 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి వరల్డ్ టీ20ని గెలుచుకుంది.

ఆ తర్వాత 2009లో జరిగిన టోర్నీలో పాకిస్థాన్ టైటిల్ విజేతగా నిలిచింది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య సిరిస్ కోసం ఇరు దేశాలకు సంబంధించిన బోర్డులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లు తలపడటం క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషంగా ఉంది.

World T20 champions

2007 - India beat Pakistan by 5 runs in final (Hosts South Africa)
2009 - Pakistan beat Sri Lanka by 8 wickets in final (England)
2010 - England beat Australia by 7 wickets in final (West Indies)
2012 - West Indies beat Sri Lanka by 36 runs in final (Sri Lanka)
2014 - Sri Lanka beat India by 6 wickets in final (Bangladesh)

తెలుగు వన్ఇండియా

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X