న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3 స్టంపింగ్స్: జమైకా చిరుత.. ఈ ధోనీ, గంతులేశారు

By Srinivas

బెంగళూరు: భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. జమైకా చిరుత ఉసెన్ బోల్ట్‌ను గుర్తు చేస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓ అద్భుతమైన స్టంపింగ్ చేసిన విషయం తెలిసిందే. పదో ఓవర్లో అద్భుత స్టంపింగ్‌తో బంగ్లా ఆటగాడిని పెవిలియన్‌ పంపాడు.

ఆంతేకాదు, చివరి ఓవర్, చివరి బంతికి కూడా బంగ్లా ఆటగాడిని పరుగెత్తుకొచ్చిన ధోనీ అవుట్ చేశాడు. ఇలా ధోనీ అవుట్ చేయడంపై అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ధోనీ.. జమైకా చిరుత ఉసెన్ బోల్ట్‌ను గుర్తు చేస్తున్నాడని పేర్కొంటున్నారు.

Also Read: క్రికెట్లో ఇదో అద్భుతం!: భారత్-బంగ్లా మ్యాచ్, కీలక మలుపులివే (పిక్చర్స్)

World T20: MS Dhoni does an Usain Bolt for India's famous run out

ఉసెన్ బోల్ట్ ఆరు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించాడు. 11 వరల్డ్ టైటిల్స్ అతని ఖాతాలో ఉన్నాయి. 100 మీటర్ల పరుగులో (9.58 సెకండ్లు), 200 మీటర్ల పరుగులో (19.9 సెకండ్లు), 4X100 మీటర్ల రిలేలో (36.84 సెకండ్లు) ఇతని పేరిటే ఉన్నాయి.

ఈ భూప్రపంచంలో ఉసేన్ బోల్ట్ అత్యంత వేగంగా కదిలే వ్యక్తి. అయితే, క్రికెట్లో అలా వేగంగా కదిలే వ్యక్తి ఎవరో తెలియదనే చెప్పవచ్చు. సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ వేగంగా కదులుతాడు. టీమిండియాలోను అలాంటి వారు ఉన్నారు.

అందులో ధోనీ కూడా కచ్చితంగా ఉంటాడు. వికెట్ల మధ్య అతను ఎలా పరుగెడతాడు, వికెట్ కీపింగ్ ఎలా చేస్తాడో అందరికీ తెలిసిందే. అతను చాలా వేగంగా కదులుతాడు. అలాంటి ధోనీ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి తన చురుకుదనాన్ని ప్రదర్శించాడు.

World T20: MS Dhoni does an Usain Bolt for India's famous run out

తొలుత ధోనీ... జడెజా బౌలింగులో బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌ను స్టంపవుట్ చేశాడు. ఆ తర్వాత రైనా బౌలింగులో షబ్బీర్ రెహ్మాన్‌ను అదేవిధంగా స్టంపవుట్ చేశాడు. అయితే, ఫైనల్ డెలివరీ మాత్రం అందరికీ గుర్తుండుపోతుందని చెప్పవచ్చు.

చివరి బంతికి బంగ్లాకు 2 పరుగులు కావాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ధోనీ వేగంగా కదిలి అవుట్ చేశాడు. అందుకోసం తన గ్లవ్‌ను ఒకదానిని పక్కన పెట్టాడు. బ్యాట్సుమెన్‌కు ధీటుగా కదిలి అతను అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్ టై కాకుండా.. విజయం సాధించేలా చేసాడు.

ధోనీ చురుకైన కదలికకు ప్రత్యక్షంగా చూస్తున్న 40,000 మంది అభిమానులు, టీవీ స్క్రీన్లపై చూస్తున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవుట్ థర్డ్ అంపైర్‌కు వెళ్లింది. టీవీ ఎంపైర్ నిర్ణయం ధోనీకి అనుకూలంగా రావడంతో అందరూ సంతోషంగా ఎగిరి గంతేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X