న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్ అరగంట ముందే ప్రారంభం, అదీ ఓటమికి కారణం!: ధోనీ

By Srinivas

ముంబై: ప్రపంచ కప్ ట్వంటీ 20లో గురువారం జరిగిన సెమీ ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి చవి చూసింది. దీనిపై మహేంద్ర సింగ్ స్పందించాడు. భారత్ గుడ్ క్రికెట్ ఆడిందని చెప్పాడు. అయితే, ఈ ఫార్మాట్లో ఎన్ని పరుగుల టార్గెట్ ఉన్నా సేఫ్ స్కోర్ కాదని చెప్పాడు.

ఒకవేళ భారత్ 220, 230 స్కోర్ చేసినా ప్రత్యర్థి జట్టు చేజ్ చేసే అవకాశం ఉందని చెప్పాడు. విండీస్ అదే పని చేసిందని చెప్పాడు. ఛేజింగ్ చేసేటప్పుడు వికెట్ సహకరిస్తుందా లేదా అనేది చాలా కీలకమని చెప్పాడు. అజింక్యా రహానే తన బాధ్యత నిర్వర్తించాడని కితాబిచ్చాడు.

World T20: MS Dhoni gives 5 reasons for India's semi-final defeat

బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడెజా విఫలమయ్యారని, వారు కాస్త రాణించినట్లయితే కచ్చితంగా గెలిచేవారమని చెప్పాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాదిరిగా రహానే బ్యాటింగ్ చేయలేడన్నాడు. చివరి ఓవర్లలో జట్టు మరో పది పదిహేను పరుగులు చేసి ఉండాల్సిందని చెప్పాడు.

అదృష్టం కంటే గేమ్ ప్లానింగ్ జట్టును గెలిపిస్తుందని చెప్పాడు. అయితే ఫస్ట్ బ్యాటింగులో193 పరుగులు అనేది చాలా గొప్ప విషయమని చెప్పాడు. టాస్ గెలిచి ఉంటే పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండేవని ధోనీ చెప్పాడు.

కాగా, విండీస్ పైన ఓటమికి ధోనీ ప్రధానంగా ఐదు కారణాలు చెప్పాడు. 1. టాస్ ఓడిపోవడం. 2. అరగంట ముందు మ్యాచ్ ప్రారంభం కావడం. అన్ని మ్యాచులు రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. 3. మరో 30 పరుగులు చేయవలసి ఉండే.య 4. గాలిలో తేమ ఉండటం వల్ల బంతిపై తడిచేరి భారత్ బౌలర్లు సరిగా గ్రిప్ చేయలేదు. 5. రెండు నో బాల్స్ వేయడం అతి పెద్ద నష్టం.

ఈ రెండు నో బాల్స్‌లోను సిమన్స్ కొట్టిన షాట్లను మన ఫీల్డర్లు క్యాచ్ పట్టారు. కానీ అవి నోబాల్స్ అని తేలడంతో అతను సిమన్స్ బతికిపోయాడు. ఓసారి 18 పరుగుల వద్ద, మరోసారి 50 పరుగుల వద్ద అతను బతికిపోయాడు. మొదటిసారి అశ్విన్ నో బాల్ వేస్తే, రెండోసారి హార్దిక్ పాండే వేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X