నవ్వులు పూయించాడు: రాంచీ టెస్టులో స్మిత్‌ను పడేసిన సాహా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఒక సరదా సంఘటన చోటు చేసుకుంది. తొలి రోజు ఆట సీరియస్‌గా సాగుతున్న సమయంలో వికెట్ వృద్ధిమాన్‌ సాహా క్రికెట్ అభిమానులకు కాస్త వినోదం పంచాడు.

రాంచీ టెస్టు, డే 1: స్మిత్‌ 100.. మాక్స్‌వెల్‌ 50, ఆసీస్ 299/4

Wriddhiman Saha & Steve Smith tumble on field, end up in awkward position

నిలకడగా ఆడుతోన్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఎలాగైనా అవుట్‌ చేసేందుకు సాహా పడిన కష్టం మైదానంలో నవ్వులు పూయించింది. ఇన్నింగ్స్‌ 80వ ఓవర్లో జడేజా లెగ్‌స్టంప్‌ మీదకు విసిరిన బంతిని స్మిత్‌ ఆడే ప్రయత్నం చేయగా అది బ్యాట్‌కు తగలకుండా అతడి కాళ్ల మధ్యలోకి దూరింది.

బంతి బ్యాట్‌కు తాకిందని భావించి క్యాచ్‌ పట్టుకోవడానికి వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ప్రయత్నించాడు. అప్పటికే బంతి 'డెడ్‌బాల్‌'గా మారినా సాహా బంతిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. చివరకు నియంత్రించుకోలేక పోయిన స్మిత్ కిందపడిపోయాడు. అయినా సరే, అతని మీద పడి బంతిని చేజిక్కించుకున్నసాహా క్యాచ్‌ కోసం అప్పీల్‌ చేశాడు.

స్మిత్‌ వైపు వెళ్ళగా, సాహా ఏం చేస్తున్నాడో అర్థం కాక స్మిత్‌ కూడా వెనక్కి జరిగిపోయే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన చూసి అంపైర్‌ ఇయాన్‌ గౌల్డ్‌ నవ్వు ఆపుకోలేకపోయాడు. అలా బిగ్గరగా నవ్వుతూనే మూడో అంపైర్‌కి నివేదించాడు. మరోవైపు భారత ఆటగాళ్లు కూడా నవ్వుని ఆపుకోలేకపోయారు.

రిప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని తేలింది. ఇదిలా ఉంటే రాంచీ టెస్టులో ఆసీస్ కెప్టెన్ 228 బంతులను ఎదుర్కొని 11 ఫోర్ల సాయంతో సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో స్మిత్‌కు ఇది 19వ టెస్టు సెంచరీ. ఈ సెంచరీతో స్మిత్ మైక్ హస్సీ, మార్క్ టేలర్‌ల 19 టెస్టుల జాబితాలో చేరాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This was yet another awkward, funny or hilarious or what ever you may call moment at the field in Ranchi, this hilarious incident took place between Steve Smith and India wicket keeper Wridhhiman Saha.
Please Wait while comments are loading...