మళ్లీ ‘థ్రిల్’ చేశాడు: క్రిస్టియాన్ మిస్ చేస్తే ధోని ఒడిసిపట్టాడు (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో బ్యాట్‌తో కంటే కీపింగ్‌లోనే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ సీజన్‌లో ధోని అద్భుతమైన స్టంపింగ్‌లతో పాటు కళ్లు చెదిరే రీతిలో రనౌట్లు చేస్తూ ఇప్పటికీ ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్‌ తానేనని క్రికెట్ అభిమానులకు తెలియజేస్తున్నాడు.

వికెట్ కీపర్‌గా ధోని అద్భుత ప్రదర్శన

ప్లే ఆఫ్ బెర్తులో నిలవాలంటే పంజాబ్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా ధోని అద్భుత ప్రదర్శన చేశాడు. ఆదివారం పూణె వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పూణె తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన ఉనాద్కత్ బౌలింగ్‌లో స్వప్నిల్ సింగ్ బంతిని థర్డ్ మ్యాన్ దిశగా తరలించేందుకు ప్రయత్నించాడు.

స్లిప్‌లో గాల్లోకి లేచిన బంతి

స్లిప్‌లో గాల్లోకి లేచిన బంతి

ఈ క్రమంలో బ్యాట్ అంచున తాకిన బంతి స్లిప్‌లో గాల్లోకి లేచింది. ఈ సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ క్రిస్టియాన్ బంతిని అందుకోవడంలో తడబడటంతో అతని చేతుల్లో పడిన బంతి మళ్లీ గాల్లోకి లేచింది. వెంటనే స్పందించిన ధోని గాల్లోకి లేచిన బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు.

15.5 ఓవర్లలో 73 పరుగులకు పంజాబ్ ఆలౌట్

15.5 ఓవర్లలో 73 పరుగులకు పంజాబ్ ఆలౌట్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.5 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 74 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె 12 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు అజింక్యా రహానె (34 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌తో 34 నాటౌట్‌), రాహుల్‌ త్రిపాఠి (20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 28), స్మిత్‌ (15 నాటౌట్‌) రాణించారు.

స్వప్నిల్‌ సింగ్‌ మినహా అందరూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం

స్వప్నిల్‌ సింగ్‌ మినహా అందరూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం

పంజాబ్‌ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌కు ఒక వికెట్‌ దక్కింది. అంతకుముందు పుణె బౌలర్ల విజృంభణతో పంజా బ్‌ 15.5 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. అక్షర్‌ పటేల్‌ (22) టాప్‌ స్కోరర్‌. వృద్ధిమాన్‌ సాహా (13), షాన్‌ మార్ష్‌ (10), స్వప్నిల్‌ సింగ్‌ (10) మినహా మిగిలినవారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ఉనాద్కట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు

ఉనాద్కట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు

శార్దూల్‌ ఠాకూర్‌ (3/19), జయ్‌దేవ్‌ ఉనాద్కట్‌ (2/12), క్రిస్టియన్‌ (2/10), ఆడమ్‌ జంపా (2/22) పంజాబ్‌ పతనాన్ని శాసించారు. ఉనాద్కట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. ఈ మ్యాచ్‌లో ధోని మూడు కీపర్ క్యాచ్‌లు అందుకుని పూణె విజయంలో కీలకపాత్ర పోషించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MS Dhoni’s unquestionable match awareness again came to fore during the Rising Pune Supergiant and Kings Punjab IPL match in Pune.
Please Wait while comments are loading...