సిరాజ్‌కు అద్భుత అవకాశం: ఎన్‌సీఏ శిక్షణ శిబిరానికి ఎంపిక

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన యువ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫాస్ట్‌ బౌలింగ్‌ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు

బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో జూన్ 19 నుంచి రెండు వారాల పాటు ఎంపికైన యువ బౌలర్లకు ఈ శిక్షణను అందిస్తారు. బీసీసీఐ సీనియర్ సెలక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఈ శిక్షణ శిబిరం జరుగుతుంది. ఈ శిక్షణ శిబిరంలో మొత్తం ఏడుగురు ఫాస్ట్ బౌలర్లు పాల్గొంటున్నారు.

Young Indian pacers practice at the NCA

ఈ శిక్షణ శిబిరానికి మహ్మద్ సిరాజ్‌తో పాటు బాసిల్‌ థంపి, నవ్‌దీప్‌ సింగ్, నాథూ సింగ్, అనికేత్‌ చౌదరీ, సిద్ధార్థ్‌ కౌల్, అంకిత్‌ రాజ్‌పుత్‌ ఎన్‌సీఏ ఎంపికయ్యారు. జులై 1తో ముగియనున్న ఈ శిక్షణ సమయంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌తో పాటు వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తారు.

ఈ శిక్షణ శిబిరానికి ఎన్‌సీఏ సిబ్బందితో పాటు, భారత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఆనంద్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించనున్నారు. జాతీయ అకాడమీలో యువ ఆటగాళ్లకిచ్చే శిక్షణ వారి కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుందని ఎన్‌సీఏ బౌలింగ్‌ కోచ్‌ నరేంద్ర హీర్వాణి అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It has been a decent season for Mohammad Siraj and Basil Thampi. Subsequent to demonstrating their grit in the local competitions and the Indian Premier League (IPL), the two will now be heading to the National Cricket Academy (NCA) in Bengaluru attend the fast bowling camp.
Please Wait while comments are loading...