భారత్‌పై పాక్ విజయం: సంబరాలు చేసుకున్న కాశ్మీర్ యువత

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 180 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పాక్ చేతిలో భారత్ ఓటమి నేపథ్యంలో భారత్‌లో క్రికెట్ అభిమానులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత ఓటమికి ప్రధాన కారణం

ఫైనల్లో భారత ఆటగాళ్లు కనీసం పోరాడకుండా ఓటమి పాలవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో భారత్‌లో పలు చోట్ల టీవీలను పగలగొట్టడంతో పాటు, క్రీడాకారుల దిష్టిబొమ్మలను సైతం దగ్ధం చేశారు. అయితే జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

Youths in Kashmir celebrate as Pakistan win Champions Trophy

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను పాకిస్తాన్‌ గెలవడంతో కశ్మీర్‌ యువత సంబరాలు చేసుకుంది. చాలా ప్రాంతాల్లో యువకులు బాణాసంచా కాల్చి, డాన్సులు చేశారు. శ్రీనగర్‌లోని పాతబస్తీలో ఫరా కాదల్‌, సెకిదాఫార్‌ ప్రాంతాల్లో సంబరాలు మిన్నంటాయి. కొంత మంది బాణాసంచా కాల్చి సీఆర్ఫీఎఫ్‌ క్యాంపులు, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోకి విసిరారు.

భారత్ Vs పాక్: మ్యాచ్ విశ్లేషణ, కోహ్లీ చారిత్రాత్మక తప్పిదం అదే

భారత్‌పై పాక్ ఘన విజయం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ మహిళలు కూడా కశ్మీర్‌ లోయలోని చాలా ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత బాజాలు, డప్పులు వాయించి తమ ఆనందాన్ని తెలిపారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో భారత్‌పై విజయం సాధించడంతో పాక్‌లో కూడా సంబరాలు మిన్నంటాయి.

క‌శ్మీర్ మీడియా సైతం
క‌శ్మీర్ ప్ర‌జ‌లే కాదు అక్క‌డి మీడియా కూడా చాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్‌పై పాకిస్థాన్ విజ‌యాన్ని పండుగ చేసుకుంది. సోమవారం క‌శ్మీర్ ప‌త్రిక‌ల ఫ‌స్ట్ పేజీల్లో ఈ వార్తే ప్ర‌ధానంగా క‌నిపించింది.
క‌శ్మీర్ సంతోషంతో చిందులేస్తుంది అని క‌శ్మీర్ రీడ‌ర్ అనే ప‌త్రిక తొలి పేజీలో వార్త‌ను ప్ర‌చురించింది. దీంతో పాటు ప్ర‌జ‌లు వీధుల్లో ర్యాలీలు నిర్వ‌హించారు.. పాక్ విజ‌యం సంద‌ర్భంగా స్వాతంత్ర్య అనుకూల నినాదాలు చేశారు అని క‌శ్మీర్ రీడ‌ర్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

ఇండియాపై పాక్ గెలిచింది.. క‌శ్మీర్ సంతోషంతో ఊగింది అని గ్రేట‌ర్ క‌శ్మీర్ ప‌త్రిక తొలి పేజీలో రాసింది. పాక్ గెల‌వ‌డంతో ప‌టాకుల మోత మోగుతున్న‌ది అని రైజింగ్ క‌శ్మీర్ ప‌త్రిక అభిప్రాయ‌ప‌డింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Youths across Kashmir Valley burst into rapture as Pakistan defeated India in a one-sided cricket final of the ICC Champions Trophy on Sunday (June 18).
Please Wait while comments are loading...