పోరాట యోధుడు యువరాజ్ 299 నాటౌట్: కెరీర్‌లో ఒకే ఒక్క డకౌట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: యువరాజ్ సింగ్... క్రికెట్‌కు పరిచయం అక్కర్లేని పేరు. అద్భుత పోరాటపటిమకు నిలువెత్తు నిదర్శనం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు దక్కిన ఆణిముత్యం. బంతిని బలంగా బాదడంలో ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అతనికి ఎవరూ సాటిరారు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన అద్భుతమైన ఆటతీరుతో విజయాన్ని అందించిన సందర్భాలు అనేకం.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

తనదైన శైలిలో మ్యాచ్‌ని ముగించే యువరాజ్ ఇప్పుడు తన క్రికెట్ కెరీర్‌లో సరికొత్త రికార్డుని అందుకోనున్నాడు. కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమైన 300 వన్డేల మార్కును చేరేందుకు యువరాజ్ సింగ్ కేవలం అడుగు దూరంలో నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే యువీకి 300వ వన్డే కావడం విశేషం.

భారత తరపున కేవలం నలుగురు మాత్రమే

భారత తరపున కేవలం నలుగురు మాత్రమే

భారత తరపున కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే మూడొందల వన్డేల మైలురాయిని అందుకున్నారు. వన్డేల్లో 300 మ్యాచ్‌లు ఆడిన మాజీ క్రికెటర్లు అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌ల సరసన చేరనున్నాడు. మ్యాచ్ విన్నర్లు అంటే వెంటనే గుర్తుకొచ్చే కపిల్ దేవ్, సచిన్, ధోనీతో సరితూగుతూ భారత్ తరుపున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు.

భారత క్రికెట్‌లో యువీకి ఓ పేజీ

భారత క్రికెట్‌లో యువీకి ఓ పేజీ

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్ల జాబితా రూపొందిస్తే అందులో యువరాజ్ సింగ్‌కి ఓ పేజీ తప్పకుండా ఉంటుంది. తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిన యువరాజ్ కెరీర్ ఆరంభంలో మెక్‌గ్రాత్, బ్రెట్‌లీ, గిలెస్పీ లాంటి ప్రమాదకర బౌలర్లను అవలీలగా ఎదుర్కొని తన సత్తా చాటాడు.

ఐసీసీ టోర్నీల్లో యువీ కీలకపాత్ర

ఐసీసీ టోర్నీల్లో యువీ కీలకపాత్ర

ఇంగ్లండ్‌తో నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో గెలుపుపై భారత్ ఆశలు వదులుకున్న వేళ యువరాజ్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీతో జట్టుకు మరో అపురూప విజయాన్ని అందించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ విజయాల్లో యవీ కీలకపాత్ర పోషించాడు.

స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు సిక్సులు

స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు సిక్సులు

2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు సిక్సులు బాదిన ఓవర్ అభిమానులకి ఇప్పటికీ గుర్తే. ఇక్కడ విశేషం ఏంటంటే 299 వన్డేలాడిన యువరాజ్ ఒకే ఒక్కసారి(2011వరల్డ్ కప్) డకౌట్ కావడం గమనార్హం. 2000వ సంవత్సరంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కెన్యాతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన యవరాజ్ సింగ్ అటు బ్యాటింగ్‌తో పాటు స్పిన్‌ బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్‌తో భారత క్రికెట్‌పై తనదైన ముద్రవేశాడు.

క్యాన్సర్‌ను జయించి తిరిగి మైదానంలోకి

క్యాన్సర్‌ను జయించి తిరిగి మైదానంలోకి

2011 వరల్డ్ కప్ తర్వాత అరుదైన జెర్మ్‌సెల్ క్యాన్సర్‌ను జయించి తిరిగి మైదానంలోకి అడిగిన పెట్టిన యువరాజ్ ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అయితే టెస్టుల్లో మాత్రం యువీ తన ప్రభావాన్ని చూపలేకపోయాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో కేవలం 40 టెస్ట్‌లకే పరిమితమయ్యాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ever since he became an integral part of Sourav Ganguly’s side, Yuvraj has been an obsession for India. In the 2002 Natwest Series, he started off with a match-winning knock against England, before going a step further in the final. In the 2003 World Cup, he did the bulk of the damage in the middle overs.
Please Wait while comments are loading...